e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home News Pushpa : 'పుష్ప‌' నుండి అన‌సూయ లుక్ లీక్.. షాక‌వుతున్న‌ ఫ్యాన్స్

Pushpa : ‘పుష్ప‌’ నుండి అన‌సూయ లుక్ లీక్.. షాక‌వుతున్న‌ ఫ్యాన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప‌. స్టైలిష్ డెరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల‌లో ఎన్ని అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌‌గా కనిపించనుండ‌గా, చిత్రాన్ని గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం.

పుష్ప సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఒక దాని త‌ర్వాత ఒక‌టి వ‌స్తుండ‌డంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌లో ఉన్నారు.రీసెంట్‌గా ఫ‌స్ట్ సింగిల్ ను ఆగ‌స్టు 13న విడుదల చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. తాజాగా మైత్రీ మూవీ మేక‌ర్స్ దాక్కో దాక్కో మేక క‌న్న‌డ వెర్ష‌న్ ఇంట్ర‌డ‌క్ష‌న్ వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేసింది. జోకే జోకే మేకే అంటూ వ‌చ్చే క‌న్న‌డ వెర్ష‌న్ బీట్ ఆడియ‌న్స్‌ని ఎంత‌గానో అల‌రిస్తుంది.

- Advertisement -

క్రిస్మ‌స్ కానుక‌గా విడుద‌ల కానున్న ఈ చిత్రంలో అందాల యాంక‌ర‌మ్మ అన‌సూయ కీల‌క పాత్ర పోషిస్తుంది. తాజాగా ఆమె లుక్‌కి సంబంధించిన ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇందులో అన‌సూయ షార్ట్ హెయిర్‌తో చాలా డీ గ్లామ‌ర‌స్ లుక్‌లో క‌నిపిస్తుంది. అన‌సూయ‌ని ఇలా చూసిన ఫ్యాన్స్ మీమ్స్ క్రియేట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. సుకుమార్ తెర‌కెక్కించిన రంగ‌స్థ‌లంలో అన‌సూయ రంగ‌మ్మ‌త్త‌గా క‌నిపించి అల‌రించిన విష‌యం తెలిసిందే.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana