గురువారం 04 జూన్ 2020
Cinema - May 15, 2020 , 12:39:26

బ‌ర్త్‌డే సంద‌ర్భంగా గ‌ర్భిణీలకి సాయం చేసిన అన‌సూయ‌

బ‌ర్త్‌డే సంద‌ర్భంగా గ‌ర్భిణీలకి సాయం చేసిన అన‌సూయ‌

యాంక‌ర్‌గా, న‌టిగా రాణిస్తున్న అన‌సూయ తన బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కీసర మండలం లోని 100 మంది గర్భిణి స్త్రీ లకు న్యూట్రిషన్ కిట్స్‌ని పంపిణీ చేశారు. అంద‌రిని ప్రేమ‌గా ప‌ల‌క‌రిస్తూ అన‌సూయ ఈ పంపిణీ చేప‌ట్ట‌డంతో వారంద‌రు మురిసిపోయారు. కీస‌ర‌లోని చీర్యాల ప్రాంతంలో ఉన్న‌ ఫంక్ష‌న్ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్య‌క్ర‌మంలో సీపీ మహేష్ భగవత్ కూడా పాల్గొన్నారు.

బుల్లితెరకి గ్లామ‌ర్ అద్దిన అందాల బ్యూటీ అనసూయ‌కి అభిమానులు, సెల‌బ్రిటీల నుండి శుభాకాంక్ష‌ల వెల్లువ కురుస్తుంది. రంగ‌మ్మ‌త్త‌గా పాపుల‌ర్ పొందిన ఈ నటి ప్ర‌స్తుతం చిరు ఆఛార్య చిత్రంతో పాటు కృష్ణ‌వంశీ రంగ‌మార్తాండ చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు.
logo