ఆదివారం 07 జూన్ 2020
Cinema - Apr 05, 2020 , 14:19:27

త‌న పేరు, చేతిపై ఉన్న టాటూ గురించి క్లారిటీ ఇచ్చిన అన‌సూయ‌

త‌న పేరు, చేతిపై ఉన్న టాటూ గురించి క్లారిటీ ఇచ్చిన అన‌సూయ‌

తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు అన‌సూయ‌. యాంక‌ర్‌గా, న‌టిగా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న అన‌సూయ ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైంది. తాజాగా నెటిజ‌న్స్‌తో కొద్ది సేపు ముచ్చ‌టించిన ఈ అమ్మ‌డు అనేక విష‌యాల‌పై  క్లారిటీ ఇచ్చింది. మీరు తరుణ్‌ భాస్కర్‌తో కలిసి మద్యం సేవించి ఓ పార్టీలో రచ్చ చేశారట కదా? అని ప్రశ్నించగా... ఈ 'అట' అనే పదాలు మీరు సరదాకి అనుకుంటే బాగుంటుందేమోనని అనసూయ సమాధానమిచ్చింది

ఇక మరో నెటిజన్ అన‌సూయ చేతిపై ఉన్న టాటూకి అర్థం ఏమిటి అని ప్ర‌శ్నించాడు. దీనికి  అనుసూయ సమాధానం చెబుతూ, 'బ్యూటీ సోల్ డీప్‌' అని తెలిపింది. ఇంకా మా నాన్న‌మ్మ పేరు అనసూయ కావ‌డంతో నాకు ఆ పేరు పెట్టార‌ని చెప్పుకొచ్చింది . అలానే తమ స్వస్థలం నల్గొండ అని , తన ఇంటిపేరు కస్బా అని పేర్కోంది అందాల భామ అన‌సూయ‌.
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo