అనసూయ అంటే అందరికి గుర్తొచ్చేది ఆమె అందాల ఆరబోతనే. బుల్లితెరకు గ్లామర్ అద్దిన అనసూయ నిత్యం హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తూ నెటిజన్స్‌ని అలరిస్తుంటుంది. రీసెంట్గా వ్యాక్సినేషన్‌కు వెళ్లినప్పుడు కూడా పొట్టిదుస్తులలో వెళ్లి అందరి ఆగ్రహానికి గురైంది. ప్రస్తుతం జబర్ధస్త్ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తుంది అనసూయ. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేయగా, ఇందులో యాంకర్ శివ అనసూయ వస్త్రధారణపై కామెంట్ చేశాడు.
హైపర్ ఆది ఈ వారం తన టీంలోకి యాంకర్ శివను తీసుకున్నాడు.ఆయనతో కలిసి తెగ సందడి చేశాడు.అయితే స్కిట్ అయిపోయిన తర్వాత శివ అనసూయని.. మీకు చిన్నచిన్న బట్టలు ఎందుకు వేసుకుంటారు అంటూ ఇలా చాలా కామెంట్లు వస్తుంటాయి.. దీనిపై మీరు ఏమంటారని ప్రశ్నించాడు. వెంటనే అనసూయ వాళ్ళకంటే తెలియదు.. మీరు ఇండస్ట్రీలో ఉంటూ ఇలా అడుగుతారా.. అది నా పర్సనల్ అనడంతో.. వెంటనే శివ పర్సనల్ అయితే ఇంట్లో వేసుకోవచ్చు కదా అని సీరియస్ అయింది. అంతేకాదు స్టేజ్ దిగి వెళ్లిపోయింది. అయితే ఇది స్క్రిప్ట్‌లో భాగమా, లేకుంటే నిజంగానే జరిగిందా అనేదా రానున్న రోజులలో తెలియనుంది.