మంగళవారం 26 జనవరి 2021
Cinema - Dec 05, 2020 , 17:26:29

అల్లు అర్జున్‌కే నో చెప్పిన అనసూయ.. కారణమేంటో తెలుసా?

అల్లు అర్జున్‌కే నో చెప్పిన అనసూయ.. కారణమేంటో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అటు యాంకర్‌గా.. ఇటు నటిగా దూసుకుపోతున్నది ఎవరైనా ఉన్నారా అంటే అది అనసూయ మాత్రమే. యాంకర్‌ సుమ కూడా కేవలం బుల్లితెరపై మాత్రమే సందడి చేస్తున్నది. కానీ, అనసూయ మాత్రం తనకు తగిన పాత్రలు వచ్చినప్పుడు కచ్చితంగా నటిస్తూనే ఉంది.    ఇప్పటికే తెలుగులో కొన్ని సినిమాలతో అనసూయకు మంచి నటిగా కూడా గుర్తింపు వచ్చింది. తాజాగా అనసూయ మెగా హీరో  అల్లు అర్జున్ సినిమాలో నటించడానికి నో చెప్పిందని ప్రచారం జరుగుతుంది. తనకు రంగస్థలం లాంటి సినిమాతో స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన ప్రముఖ డైరెక్టర్‌ సుకుమార్ అడిగినా కూడా నో చెప్పిందని వార్తలొస్తున్నాయి. 

ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోన్న అనసూయ చాలా బిజీగా ఉంది. తెలుగులో  కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ మార్తాండతో పాటు చిరంజీవి ఆచార్య.. రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న కిలాడి సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తున్నది. ఇప్పుడు వీటితో పాటు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో కూడా కీలకమైన పాత్ర కోసం అనసూయను అడిగినట్లు సమాచారం. 

రంగమ్మత్త పాత్రకు న్యాయం చేసిన   ఈమెకు సుకుమార్‌ మళ్లీ బంపర్ ఆఫర్ ఇచ్చాడట.  ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది. సినిమాలో అల్లు అర్జున్ సహా రష్మిక మందన్న, మిగిలిన వాళ్లు కూడా మేకప్ లేకుండానే డీ గ్లామరస్ గా నటిస్తున్నారు.  ఇందులో కథను మలుపు తిప్పే పాత్ర కోసం అనసూయను అడిగితే నో చెప్పినట్లు తెలుస్తుంది. దానికి కారణం మేకప్ లేకుండా నటించమని కోరడమే. తనకు అలాంటి డీ గ్లామర్ రోల్ చేయడం ఇష్టం లేకపోడంతో ఈ ఆఫర్‌కు నో చెప్పిందని తెలుస్తోంది. బన్నీ సినిమా కాదనుకున్నా కూడా తమిళ ఇండస్ట్రీకి కూడా వెళ్తుంది అనసూయ. తాజాగా విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఓ తమిళ సినిమాలో అనసూయ నటించబోతుంది. కొత్త ప్రయాణానికి శ్రీకారం అంటూ ఈ మధ్యే విజయ్‌తో ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది అనసూయ. అలా మొత్తానికి అన్ని ఇండస్ట్రీలు.. అందరు హీరోలను చుట్టేస్తుంది ఈ జబర్దస్త్ బ్యూటీ.logo