Anasuya bharadwaj in Pushpa | తెలుగు ఇండస్ట్రీలో అటు యాంకర్‌గా.. ఇటు నటిగా దూసుకుపోతున్నది అనసూయ. ఒకవైపు బుల్లితెరపై తన యాంకరింగ్‌తో మెప్పిస్తూనే.. తగిన పాత్రలు వచ్చినప్పుడు కచ్చితంగా చేస్తూనే ఉంది ఈ రంగమ్మత్త. ఇప్పటికే తెలుగులో పలు సినిమాలతో మంచి నటిగా గుర్తింపు కూడా తెచ్చుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈమె అల్లు అర్జున్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. ఇన్ని రోజులు పుష్ప సినిమాలో ఈమె నటిస్తుందా? లేదా? అనే అనుమానాలు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ అనుమానం అవసరం లేదు. అనసూయ పుష్పలో నటిస్తుందని ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది.
ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలు చేస్తున్నది. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండతో పాటు రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్లో వస్తున్న కిలాడి సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తుంది. వీటితో పాటు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాలో కూడా కీలకమైన పాత్రలో కనిపిస్తుంది అనసూయ. ఇందులో సునీల్ భార్యగా నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. అందులోనూ నెగిటివ్ ఛాయలున్న పాత్రలో కనిపించబోతుంది అనసూయ భరద్వాజ్.
ఈ సినిమా రాయలసీమ ప్రాంతంలో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. సినిమాలో అల్లు అర్జున్ సహా రష్మిక మందన్న, మిగిలిన వాళ్లు కూడా డీగ్లామరస్‌గా నటిస్తున్నారు. ఇందులో కథను మలుపు తిప్పే పాత్ర కోసం అనసూయను తీసుకున్నారు సుకుమార్. ఇందులోనూ మేకప్ లేకుండానే నటించబోతుంది అనసూయ. సునీల్ కూడా ఈ చిత్రంలో విలన్‌గానే నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి పుష్పలో రంగమ్మత్త చేస్తుండటంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా తొలి భాగం విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు.. మరి ఆచార్య, పుష్ప పరిస్థితేంటి?
సంక్రాంతికి స్టార్ వార్.. పండక్కి క్యూ కట్టిన బడా హీరోలు
Monal Gajjar | మోనాల్ గజ్జర్ ఖాతాలో భారీ ఆఫర్..?
వైట్ డ్రెస్‌లో ఏంజెల్లా కనిపిస్తున్న కియారా
పెళ్లి తిరుపతిలో, సంగీత్ చెన్నైలో అని చెప్పిన జాన్వీ కపూర్