కరోనా తర్వాత అందాల ముద్దుగుమ్మలు వెకేషన్ కోసం మాల్దీవుల బాట పడుతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత చాలా మంది భామలు మాల్దీవులు అందాలని తనివితీరా ఆస్వాదించేందుకు వెళ్లారు. అక్కడ విహారంతో మంటలు పుట్టించారు. తాజాగా మాల్దీవుల్లో లైగర్ బ్యూటీ అనన్య పాండే రచ్చ చేస్తుంది.
అక్కడ వెరైటీగా ఫొటో షూట్స్ చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కేక పెట్టిస్తుంది. లైగర్ బ్యూటీని ఇలా చూసి ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు. లైగర్ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటుండగా, ఈ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు.మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘లైగర్’ కోసం బాక్సింగ్‌లో విజయ్ శిక్షణ తీసుకున్నారు. ఇందులో విజయ్‌దేవరకొండ పొడవాటి జుట్టుతో మాస్ లుక్‌లో విభిన్నంగా కనిపించనున్నారు.