దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడిస్ లాంటి చిత్రాల్లో మెరిశాడు టాలీవుడ్ యాక్టర్ విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్. ప్రస్తుతం ఈ యాక్టర్ పుష్పక విమానంలో నటిస్తున్నాడు. తాజాగా సిలకా పాటకు తన కొరియోగ్రాఫర్ తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. రామ్ మిర్యాల రాసి, కంపోజ్ చేసి పాడిన ఈ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకర్షిస్తోంది.
నేను సినిమాలో డ్యాన్స్ చేయను. కానీ ఈ క్రేజీ సాంగ్కు ఎందుకు డ్యాన్స్ చేయకూడదు..అంటూ క్యాప్షన్ ఇచ్చాడు ఆనంద్. ఈ చిత్రంలో గీతా సైని, శాన్వీ మేఘన ఫీమేల్స్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. విజయ్ దేవరకొండ సమర్పణలో విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి, గోవర్థనరావు రావు దేవరకొండ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆనంద్ డ్యాన్స్ వీడియో ఆన్లైన్ లో హల్చల్ చేస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.