శనివారం 27 ఫిబ్రవరి 2021
Cinema - Jan 25, 2021 , 09:22:23

బ‌క్క‌చిక్కిన ముద్దుగుమ్మ‌.. న‌మ్మ‌లేక‌పోతున్న ఫ్యాన్స్

బ‌క్క‌చిక్కిన ముద్దుగుమ్మ‌.. న‌మ్మ‌లేక‌పోతున్న ఫ్యాన్స్

సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా ద‌గ్గ‌రైన ముద్దుగుమ్మ అంజ‌లి. అందం, అభిన‌యంతో పాటు చ‌క్క‌ని న‌టినా చాతుర్యం ఉన్న అంజ‌లి కెరీర్‌లో దాదాపు 46 సినిమాలు చేస్తే తెలుగులో 15కు పైగా సినిమాలు చేసింది. ఇటీవ‌ల విడుద‌లైన నిశ్శ‌బ్ధం చిత్రంలో కాప్‌గా క‌నిపించి అల‌రించింది. అయితే ఎంతో బొద్దుగా క‌నిపించే ఈ ముద్దుగుమ్మ ఈ మ‌ధ్య స్లిమ్‌గా మారి వ‌రుస ఫొటో షూట్స్ చేస్తుంది.

అంజ‌లిని ఇంత‌గా స్లిమ్‌గా చూసేస‌రికి అభిమానులు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. వారి క‌ళ్ళ‌ను వారే న‌మ్మ‌లేక‌పోతున్నారు. స‌న్న‌బ‌డేందుకు ఎంత క‌ష్ట‌ప‌డి ఉంటుందో అని అభిమానులు ఊహ‌లోచ‌న‌లు చేస్తున్నారు. తాజాగా అంజ‌లి త‌న పెంపుడు కుక్క‌తో క‌లిసి ఫొటోల‌కు ఫోజులిచ్చింది. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం అంజ‌లి సినిమాల‌తో పాటు ఓటీటీలో ప్ర‌సార‌మ‌వుతున్న వెబ్ సిరీస్‌ల‌లోను న‌టిస్తుంది. ఇన్నాళ్ళు హోమ్లీగా క‌నిపించిన ఈ అమ్మ‌డు ఇప్పుడు బోల్డ్ పాత్ర‌ల‌కు సై అంటుంది.  

VIDEOS

logo