గురువారం 04 జూన్ 2020
Cinema - May 01, 2020 , 16:48:04

మెడికల్‌ థ్రిల్లర్‌ ‘A’ సినిమా టైటిల్‌ పోస్టర్‌ విడుదల

మెడికల్‌ థ్రిల్లర్‌ ‘A’ సినిమా టైటిల్‌ పోస్టర్‌ విడుదల

నితిన్‌ ప్రసన్న,  ప్రీతీ అశ్రాని(మళ్లీ రావా, ప్రెజర్‌ కుక్కర్‌ ఫేం) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘A’. అవంతిక ప్రొడక్షన్స్‌ రూపొందిస్తున్న సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. ఊహకు అందని అనూహ్యమైన సస్పెన్స్ మెడికల్ థ్రిల్లర్ "A" సినిమా టైటిల్ పోస్టర్‌ను  చిత్రబృందం ఇవాళ విడుదల చేసింది. 

టైటిల్‌ పోస్టర్‌ విడుదల సందర్భంగా యుగంధర్‌ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కథాంశం చాలా అనుహ్యమైనది. ఇప్పటి వరకు ఏ సినిమాల్లో కూడా రానటువంటి ఒక విభిన్నమైన కథ ఇది.  1977 నుండి 2019 మధ్య కాలంలో ఈ కథ నడుస్తుంది.    సాంకేతిక నిపుణులు అందరూ కూడా ఫిల్మ్ స్కూల్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వాళ్లు కావటంతో సినిమా టెక్నికల్ గా అద్భుతంగా వచ్చింది.  అనంత శ్రీరామ్  సాహిత్యం ఈ సినిమాకి పెద్ద ఎసెట్ అవుతుందని డైరెక్టర్ ఆనందం వ్యక్తం చేశారు. నటీనటుల కోసం దాదాపు నాలుగు నెలల్లో  300 కి పైగా ఆడిషన్స్ చేసినట్లు తెలిపారు.  


logo