గురువారం 29 అక్టోబర్ 2020
Cinema - Sep 15, 2020 , 00:07:14

వారసుల్ని ద్వేషించడం తగదు

వారసుల్ని ద్వేషించడం తగదు

సమాజంలో ఎలాంటి చెడు సంఘటనలు జరిగిన బాలీవుడ్‌పై నిందలు వేయడం అందరికీ అలవాటుగా మారిపోయిందని చెప్పింది కథానాయిక అమైరా దస్తూర్‌. గత కొన్ని నెలలుగా బాలీవుడ్‌లో జరుగుతోన్న పరిణామాలపై ఆమె మాట్లాడుతూ ‘ గ్రూపిజం, ఫేవరేటిజం బాలీవుడ్‌లోనే  కాదు ప్రతిచోట కనిపిస్తాయి. వాటిని మార్చాలంటే బహిష్కరణ ఒక్కటే శాశ్వత పరిష్కారం కాదు. ఒకరిపై అభిమానంతో ఇతరుల మనోభావాలను కించపరిచేలా సోషల్‌మీడియాలో చెడు ప్రచారం చేయడం సులభమే. కానీ అలాంటి అసత్యాల వల్ల కొన్నిసార్లు ఏ తప్పు చేయని వారు  వేదనను అనుభవిస్తుంటారు. తారల జీవితాలపై ఎలాంటి వ్యాఖ్యలైనా చేయొచ్చనే చులకనభావం ప్రజల్లో ఉంది. అందుకే నటీనటులు తప్పులు  చేయకపోయినా నిందించడం కామన్‌గా మారిపోయింది. బయటివారితో పోలిస్తే వారసులకు  చిత్రసీమలోని కొన్ని అనుకూలతను ఉండటం వాస్తవమే. అలాగని వారిని ద్వేషభావంతో చూడటం సరికాదు’ అని తెలిపింది.