గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 05, 2020 , 10:46:51

ముద్దుల కుమారుడితో అమీ జాక్స‌న్..ఫోటోలు వైర‌ల్

ముద్దుల కుమారుడితో అమీ జాక్స‌న్..ఫోటోలు వైర‌ల్

మద్రాసు పట్టణం, ఐ, 2.0, ఎవ‌డు చిత్రాల‌తో గుర్తింపు తెచ్చుకున్న బ్రిటీష్ బ్యూటీ అమీ జాక్స‌న్. సౌత్ చిత్రాలు ఈ అమ్మ‌డికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. కెరీర్ ప‌రంగా పెద్ద‌గా ఫోక‌స్ కాని అమీ  గ్లామ‌ర్ తో కుర్ర‌కారుని ఫ్లాట్ చేసేసింది. అయితే సినిమా అవ‌కాశాలు త‌గ్గ‌డంతో లండన్‌కు వెళ్ళిన అమీ జాక్స‌న్..జార్జ్ అనే వ్య‌క్తితో ప్రేమ‌లో ప‌డింది. అత‌నితో నిశ్చితార్దం కూడా జ‌రుపుకుంది. 

అయితే వివాహం కాకుండానే పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన అమీ జాక్స‌న్ త‌న కుమారుడి ఫోటోల‌ను త‌ర‌చూ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్స్‌కు కావ‌ల‌సినంత థ్రిల్ అందిస్తూ ఉంటుంది. తాజాగా కుమారుడు ఆండ్రియాస్‌తో క‌లిసి స‌ర‌దాగా ఆడుకుంటున్న ఫోటోలు షేర్ చేసింది. ఓ  ఫోటోలో ఆండ్రియాస్ నిద్ర పోతుండ‌గా, దీనికి లేజీ మార్నింగ్స్ అనే కామెంట్ పెట్టింది. ఇక కొద్ది రోజుల క్రితం త‌న కుమారుడి బ‌ర్త్‌డే ఫోటోల‌ను కూడా షేర్ చేయ‌గా, అవి సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొట్టాయి. logo