బుధవారం 27 మే 2020
Cinema - Apr 25, 2020 , 08:34:34

డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్ ఫాంలోకి తెలుగు సినిమా..!

డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్ ఫాంలోకి తెలుగు సినిమా..!

కోట్లు ఖ‌ర్చు పెట్టి తీసిన సినిమాలు లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డ్డాయి. మ‌ళ్ళీ థియేట‌ర్స్ ఎప్పుడు ఓపెన్‌ అవుతాయ‌నే దానిపై క్లారిటీ లేదు. ఈ క్ర‌మంలో కొంద‌రు నిర్మాత‌లు త‌మ సినిమాలని డైరెక్ట్‌గా డిజ‌ట‌ల్ ప్లాట్‌ఫాంలోకి రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు. ఆ మ‌ధ్య నాని, సుధీర్ బాబు న‌టించిన వి సినిమా థియేట‌ర్‌లోకి రాకుండానే అమేజాన్ ప్రైంలోకి వ‌స్తుంద‌ని అన్నారు. దాన్ని నిర్మాత‌లు ఖండించారు.  

తాజాగా రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్ హీరోహీరోయిన్లుగా కొత్త దర్శకుడు సురేందర్ కొంటాడి తెరకెక్కించిన చిత్రం ‘అమృతరామమ్’. పద్మజ ఫిలింస్, సినిమావాలా బ్యానర్లపై ఎస్.ఎన్.రెడ్డి నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలోనే చేశారు. నిర్మాత మధుర శ్రీధర్ ఈ సినిమా ఆడియో హక్కులను కొనుగోలు చేయ‌గా, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి.సురేష్ బాబు ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుకొచ్చారు. మార్చి 27న విడుద‌ల కావ‌ల‌సిన ఈ సినిమా లాక్‌డౌన్ కార‌ణంగా వాయిదా ప‌డింది. సినిమా రిలీజ్‌ని మ‌రింత లేట్ చేయోద్దనే ఉద్ధేశంతో నిర్మాత‌లు  ఈనెల 29న జీ5లో ‘అమృతరామమ్’ ప్రీమియర్ ప్రసారం  చేసేందుకు సిద్ద‌మ‌య్యారు.


logo