శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Mar 19, 2020 , 13:39:46

ప్రపంచ ప్రజలారా..! మేల్కొండి..!! మా పరిస్థితి మీకు రావద్దు : ఇటలీ

ప్రపంచ ప్రజలారా..! మేల్కొండి..!!  మా పరిస్థితి మీకు రావద్దు : ఇటలీ

రామ్ మిట్టకంటి, అమిత రంగనాథ్ హీరోహీరోయిన్లుగా కొత్త దర్శకుడు సురేందర్ కొంటాడి తెరకెక్కించిన చిత్రం ‘అమృతరామమ్’. పద్మజ ఫిలింస్, సినిమావాలా బ్యానర్లపై ఎస్.ఎన్.రెడ్డి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలోనే చేశారు. అమ్మాయి ప్రేమ క‌థ‌ని దర్శకుడు సురేందర్ అందంగా తెర‌కెక్కించారు . ఈ చిత్ర బృందం..  ఇటలీ దేశం మాదిరిగా మన దగ్గర కూడా పరిస్థితులు చేయి దాటి పోకుండా ఉండేందుకు మ‌న‌ల్ని  అప్రమత్తం చేస్తోంది.  కరోనాను తేలిగ్గా తీసుకుంటే ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారి తీస్తోందో అక్క‌డ ప్ర‌జ‌ల ప్ర‌త్య‌క్ష అనుభ‌వాల ఆధారంగా  ఇటలీ నుండి సందేశాన్ని పంపింది. 

అందమైన దేశం.. ప్రశాంతమైన జీవితం.... సుఖసంతోషాలతో ప్రజలు.. మా దేశం ఇటలీ.. మానగరం మిలాన్..  నేను మీకు ఒక విషయాన్ని చెప్పబోతున్నాను.. ఒళ్లు దగ్గర పెట్టుకొని వినండి అని సుదీర్ఘ లేఖ రాసారు. 

మా నగరంలో జీవితం ప్రస్తుతం ఏ విధంగా ఉంది? ఎందుకు ఈ విధంగా దుర్బరం గా మారిపోయింది?? ప్రపంచంలోనే అందమైనదిగా పేరొందిన మానగరం.. ఎందుకిలా అయింది.?

మీరంతా మేము చేసిన పొరపాట్ల నుండి నేర్చుకొని.. మాలాగా మీ జీవితాలను.. మీ దేశాన్ని చీకట్లోకి నెట్టి వేయారని, నెట్టి వేయకుండా ఉంటారని.. మీకు ఈ విషయం చెబుతున్నాను.

ఇప్పుడు మేమంతా ఉన్నది క్వారంటైన్ లో.. వీధుల్లోకి వెళ్ళలేము.. పొరపాటున వెళితే.. వెంటనే పోలీస్ లు వచ్చి తీసుకెళ్లి చెరసాలలో బంధిస్తారు.  అన్ని మూతపడ్డాయి. షాపులు, ఆఫీసులు, వీధులు అన్ని మూతపడ్డాయి. మాకు అనిపిస్తుంది.. ఇదే యుగాంతం ఏమో అని .మాది ఒక అందమైన అభివృద్ధి చెందిన దేశం... మేము అనుకోలేదు.. ఇలా ఈనాడు గాఢాంధకారం లోకి నెట్టి వేయబడుతుంది మా దేశం అని.. దీనికంతటికి కారణం ఒకటే.. మేమే ఇటాలియన్స్.

మేము చేసినటువంటి తప్పె మా దేశం అనుభవిస్తున్న ఈ కష్టానికి కారణం. ఒక్క క్షణం మేము గత వారం మా ప్రభుత్వం అధికారులు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే.. ఈనాడు మా దేశానికి ఈ పరిస్థితి వచ్చేది కాదు. వ్యాధి వ్యాపిస్తుంది అని.. బయటకు వెళ్ళవద్దని..మా ప్రభుత్వం సెలవులు ఇస్తే.! మేము ఏం చేసామ్....?  విహారయాత్రలకు వెళ్ళాము. సినిమాకి వెళ్ళాం.  చిన్న చిన్న పార్టీలు చేసుకున్నాం.  బజారు లో కూర్చుని గుంపులుగుంపులుగా ముచ్చట్లు పెట్టుకున్నాం . అందరం కూడా ప్రభుత్వం చేసిన సూచనను చాలా తేలికగా తీసుకున్నాం . ఆనాడు మాకు తెలియదు.. ఆ క్షణం చేసినటువంటి ఆ చిన్న తప్పు.. ఈనాడు మా దేశాన్ని.. మా దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుందని.  రోజుకు రెండు వందల మంది చనిపోతున్నారు. మా దేశంలో మందులు లేక కాదు, వైద్యులు లేక కాదు,  కేవలం అంతమంది వ్యాధిగ్రస్తులను ఉంచడానికి సరిపోయేంత స్థలం లేక . ఇదంతా పౌరులుగా చేసిన తప్పు వల్లనే.. ప్రభుత్వం చెప్పిన మాట వినకపోవడం వలనే..

అవును మేము తప్పు చేశాం :

ప్రపంచ ప్రజలారా..! మేల్కొండి..!!  మా పరిస్థితి మీకు రావద్దని మా ఆశ ఆకాంక్ష . తక్షణమే మీ ప్రభుత్వం మీ అధికారులు చేసినటువంటి సూచనలు పాటించండి. పండుగలు,జాతరలు, పెళ్లిళ్లు, పేరంటాలు.. బతికుంటే ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడైనా చేసుకోవచ్చు.. వినండి.. అందమైన, అభివృద్ధి చెందిన ఒక చిన్న దేశంగా మొదలెట్టిన మా ప్రయాణం ఈనాడు ఎలా ఉందో మీరంతా చూస్తూనే ఉన్నారు...


మీకు మా పరిస్థితి రావొద్దు...

మీరు మారతారని ఆశిస్తూ 

మీ మిత్ర దేశ ఇటలీ పౌరుడు.


logo