గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Oct 15, 2020 , 11:33:33

చిరు విషెస్‌తో ఉప్పొంగిపోయిన‌ సాయి ధ‌ర‌మ్

చిరు విషెస్‌తో ఉప్పొంగిపోయిన‌ సాయి ధ‌ర‌మ్

మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ ఈ రోజు 34వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు అభిమానులు, ప‌లువురు సెల‌బ్రిటీల నుండి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి కూడా తేజూకి స్పెష‌ల్ విషెస్ తెలియ‌జేస్తూ..`సోలో బ్రతుకే సో బెటరు` సినిమాలోని `అమృత` పాటను విడుద‌ల చేశారు. హ్యాపీ బ‌ర్త్‌డే తేజ్.. సోలోగా ఉన్న‌ప్పుడే ఎంజాయ్ చేయ్. నీ బ్యాచిల‌ర్ లైఫ్ ఇంకొన్ని రోజులే అంటూ కామెంట్ కూడా రాసారు.

చిరు విషెస్‌తో ఉప్పొంగిపోయిన సాయిధ‌ర‌మ్ తేజ్ త‌న మామ‌కు ధన్య‌వాదాలు తెలిపారు. ఇది పుట్టిన రోజు నాడు  ఉత్తమ బహుమతి ... ఈ బ‌ర్త్‌డేని  మరింత ప్రత్యేకంగా చేసినందుకు  ధన్యవాదాలు ...మిమ్మ‌ల్ని ఎప్పటికీ ప్రేమిస్తుంటాను. మీ ఆశీర్వాదం క‌న్నా మరేదీ అడ‌గ‌ను . థ్యాంక్యూ సో మ‌చ్ మామా అంటూ తేజూ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. చివ‌రిగా తేజూ ప‌త్రి రోజూ పండ‌గే చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అలరించిన సంగ‌తి తెలిసిందే. 


తాజావార్తలు


logo