మంగళవారం 27 అక్టోబర్ 2020
Cinema - Oct 13, 2020 , 17:54:57

అమృత నా పిల్ల‌ల్ని క‌లవనీయ‌లేదు: సైఫ్ అలీఖాన్

అమృత నా పిల్ల‌ల్ని క‌లవనీయ‌లేదు: సైఫ్ అలీఖాన్

బాలీవుడ్ న‌టుడు సైప్ అలీఖాన్ ప‌ర్స‌న‌ల్ లైఫ్ కు సంబంధించిన విష‌యాలు త‌ర‌చూ హెడ్‌లైన్స్ లో వ‌స్తుంటాయ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. న‌టి అమృతా సింగ్ ను పెళ్లి చేసుకోవ‌డం 13 ఏండ్ల త‌ర్వాత విడాకులు తీసుకున్నాడు. ఆ త‌ర్వాత రోసా క్యాట‌లానోతో కోన్నాళ్లు డేటింగ్ చేశాడు. అనంత‌రం క‌రీనాక‌పూర్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. సైఫ్ అలీఖాన్‌-అమృతాసింగ్ విడాకుల అంశం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. విడాకుల అంశంపై సైఫ్ ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

'నా భార్య, నేను వేర్వేరు మార్గాల్లో వెళ్తాం. నా భార్య ఆలోచ‌న‌ల‌ను నేను గౌర‌విస్తాను. కానీ నేనెంత భ‌యంక‌ర‌మైన భ‌ర్త‌న‌ని త‌ర‌చూ గుర్తు చేసుకుంటాను. నా ప‌ర్సులో కుమారుడు ఇబ్ర‌హీం ఫొటో ఉంటుంది. ప్ర‌తీసారి ఆ ఫొటోను చూస్తుంటా. నాకు ఏడుపొచ్చేది. నా కూతురు, కొడుకు ఎప్పుడూ మిస్ అవుతున్నాన‌న్న ఫీలింగ్ ఉంటుంది. నాకు పిల్ల‌ల‌ను క‌లిసే అవ‌కాశం లేదు. అమృత నా పిల్ల‌ల్ని క‌ల‌వ‌నీయ‌లేదు. సారా, ఇబ్ర‌హీం న‌న్ను క‌లిసేందుకు వారు (అమృత కుటుంబ‌స‌భ్యులు)అనుమతించ‌రు. ఎందుకంటే నా జీవితంలోకి కొత్త మ‌హిళ రావ‌డం వ‌ల్ల‌..నా పిల్ల‌లు ఎక్కువ‌గా ప్ర‌భావితం అవుతారు. ఆ విష‌యం అమృత‌కు చాలా బాగా తెలుసు. అమృత టీవీ సీరియ‌ల్స్ లో ప‌ని చేసేందుకు బ‌య‌ట‌కు వెళ్లిన‌పుడు..నా పిల్ల‌లు అమృత బంధువులతో క‌లిసి పెరిగారు. నేను నా కుటుంబాన్ని పోషించేందుకు సిద్దంగా ఉన్న‌పుడు ఆమె ఎందుకు అలా చేయాలని' ఇంట‌ర్క్యూలో చెప్పుకొచ్చాడు సైఫ్ అలీఖాన్ . logo