మెల్బోర్న్: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. అతడి ప్రేయసి, కాబోయే భార్య బెకీ బోస్టన్ ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. వసంత కాలంలో బేబి బోస్టన్ కమిన్స్ రానున్నాడని ఫొటోలను పోస్ట్ చేసింది. ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడడంతో కమిన్స్ ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్నాడు. ఐపీఎల్లో కమిన్స్ ఆడుతున్న కోల్కతా నైట్రైడర్స్ ఫ్రాంచైజీ అతడికి శుభాకాంక్షలు తెలిపింది.