ఆదివారం 01 నవంబర్ 2020
Cinema - Sep 20, 2020 , 13:35:58

లాస్య సెటైర్లు..తాను వెళ్లిపోతాన‌న్న మాస్ట‌ర్

లాస్య సెటైర్లు..తాను వెళ్లిపోతాన‌న్న మాస్ట‌ర్

బిగ్ బాస్ హౌజ్ లో శ‌నివారం ఎపిసోడ్ లో అంద‌రూ ఊహించిన‌ట్టుగానే క‌రాటేక‌ళ్యాణి బిగ్ బాస్ హౌజ్ కు గుడ్ బై చెప్పేసింది. ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌజ్ లో ఏం జ‌రిగాయ‌నే విష‌యంలోకి వెళితే.. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న వాతావ‌ర‌ణం, ఆహారం త‌న‌కు ప‌డ‌టం లేద‌ని..త‌నను ఇంట్లో నుంచి పంపేయాల‌ని చెప్పిన గంగ‌వ్వ‌..ఈ సారి ఆరోగ్యం కుదుట‌ప‌డ‌టంతో ఇంటిలో నుంచి పోన‌ని స్ప‌ష్టం చేసింది. ఎంట్రీ ఇచ్చిన‌పుడు ఎంత ఉత్సాహంగా ఉందో అంతే జోష్ తో అవినాష్ ను బ‌ర్రె ముక్కు అంటూ చుర‌క‌లంటించింది గంగ‌వ్వ‌.

ఇక క‌న్ఫెష‌న్ రూంలోకి వెళ్లిన గంగ‌వ్వ‌ను నాగార్జున అవ్వ అన‌డం మానేసి గంగ‌మ్మ అని పిలిచారు. ఆ త‌ర్వాత ఇంట్లో ఫొటో కాంపిటేష‌న్ జ‌రిగింది. మోనాల్, అభిజిత్ కు ముద్దులిస్తూ ఫొటోల‌కు పోజిచ్చింది.  మ‌రోవైపు దివి, మెహ‌బూబ్ కూడా డిఫ‌రెంట్ యాంగిల్స్ లో ఫొటోలు దిగి సంద‌డి చేశారు. ఇదంతా జ‌రుగుతుండ‌గా..ఇంటిస‌భ్యులెవ‌రూ గేమ్‌ను సీరియ‌స్ గా తీసుకోవ‌డం లేద‌ని నాగార్జున మండిప‌డ్డారు. బిగ్ బాస్ హౌజ్ కు వ‌చ్చేది గెలవ‌డానిక‌ని నామినేట్ అయిన స‌భ్యుల‌కు చెప్పాడు. నామినేష‌న్ ప్ర‌క్రియ‌ను సిరీయ‌స్ గా తీసుకోవాల‌ల‌ని చెప్తే..అలా కాకుండా దానిపై జోకులు వేసుకుంటూ పాట పాడుకున్నార‌ని నాగ్ మండిప‌డ్డాడు. మ‌రోవైపు గంగ‌వ్వ‌ను నామినేట్ అయ్యే చేసినందుకు నోయ‌ల్‌ను తిట్టాడు. మంచి వాళ్లు అని మార్కులు కొట్టేసేందుకు త్యాగాలు చేస్తున్నారు..కానీ ఆడియెన్స్ మాత్రం ఎవ‌రైతే నిజంగా ఆడుతున్నార‌నిపిస్తుందో వారికే ఓట్లేసి గెలిపిస్తార‌ని అన్నాడు. ఆ త‌ర్వాత గంగ‌వ్వ సేఫ్ అయింద‌ని నాగార్జున ప్ర‌క‌టించారు. 


ఇంటిస‌భ్యుల‌తో హీరో-జీరో గేమ్..

అనంత‌రం బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టంట్ల‌తో హీరో-జీరో గేమ్ ఆడించారు. హీరో అనుకున్న‌వాళ్ల‌ను కుర్చీ మీద కూర్చోబెట్టాలి. జీరో అనుకున్నోళ్ల‌ను అక్క‌డే ఏర్పాటు చేసిన మార్గం ద్వారా మెడ‌ప‌ట్టి బ‌య‌ట‌కు పంపించేయాల‌ని సూచించాడు. గేమ్‌లో భాగంగా నోయ‌ల్ హీరోగా అమ్మ‌రాజ‌శేఖ‌ర్ ను, జీరోగా కుమార్ సాయిని ఎంపిక చేశాడు. సోహైల్..హీరోగా నోయ‌ల్ ను జీరోగా క‌ళ్యాణి పేర్లు చెప్ప‌గా, దేవి..హీరోయిన్ గా అరియానాను,జీరోగా అమ్మ‌రాజ‌శేఖ‌ర్ పేరు చెప్పింది. మ‌రోవైపు సుజాత‌..అమ్మ‌రాజ‌శేఖ‌ర్ ను హీరోగా, క‌ళ్యాణిని జీరోగా చెప్పాడు. మ‌ధ్య‌లో దేవి నాగ‌వ‌ల్లి క‌ల‌గ‌జేసుకుని బిగ్ బాస్ పిచ్చి కామెడీ రూట్ లో వెళ్తుంద‌ని..కామెడీ చేస్తే ఇక్క‌డ హీరోలా అంటూ అమ్మ‌రాజ‌శేఖ‌ర్ ను దుమ్ముదులిపింది. నామినేష‌న్ ప్ర‌క్రియ త‌ర్వాత త‌న‌ను వేరు చేసి చూస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అనంత‌రం కుమార్ సాయి..హీరోగా అభిజిత్‌ను, జీరోగా నోయ‌ల్ పేరు చెప్ప‌గా, హారిక‌..అభిజిత్ ను హీరోగా, జీరోగా కుమార్ సాయిని, లాస్య‌..హీరోయిన్ గా గంగ‌వ్వ‌ను, జీరోగా అమ్మరాజ‌శేఖ‌ర్ పేర్ల‌ను ఖ‌రారు చేసింది. 

శృతిమించిన కామెడీ..నాకు న‌చ్చలేదు: లాస్య‌

హౌజ్ లో కామెడీ శృతిమించింద‌ని, అది త‌న‌కు నచ్చ‌లేద‌ని లాస్య చెప్పింది. మ‌రోవైపు దివి గర్భ‌వ‌తిగా న‌టించాల్సి వ‌చ్చిన‌పుడు అమ్మ‌రాజ‌శేఖ‌ర్..దివికి పిల్లో స‌ర్ద‌డం కూడా న‌చ్చలేదంది. లాస్య మాట‌లతో హ‌ర్ట్ అయిన అమ్మ‌రాజ‌శేఖ‌ర్ తాను వెళ్లిపోతానని, అస‌లు కామెడీయే చేయ‌నని, న‌న్ను పంపించేయండ‌ని క‌న్నీటిప‌ర్యంత‌మయ్యాడు. దీంతో గంగ‌వ్వ క‌ల‌గ‌జేసుకుని అవ‌న్నీ స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని, అలా చేయ‌డం త‌ప్పేమి కాద‌ని, రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ ఉండాల్సిందేన‌ని ఖ‌రాఖండిగా చెప్పేసింది. మ‌రోవైపు నాగార్జున కూడా అంద‌రికీ న‌చ్చాల్సిన అవ‌స‌రం లేద‌ని అమ్మ‌రాజ‌శేఖ‌ర్ కు భ‌రోసానిచ్చేందుకు ప్ర‌య‌త్నించాడు. 


ఇక ఆ త‌ర్వాత అరియానా..హీరోయిన్ గా గంగ‌వ్వ‌ను, జీరోగా క‌ళ్యాణిని, క‌ళ్యాణి‌..హీరోయిన్ గా గంగ‌వ్వ‌ను, జీరోగా సుజాత‌ను ఎంపిక చేయ‌గా..అఖిల్‌, మోనాల్‌..హీరోయిన్ గా గంగ‌వ్వ‌ను, జీరోగా కుమార్ సాయిని క‌న్ఫామ్ చేశారు. ఇక గంగ‌వ్వ‌, అవినాష్..హీరోగా అమ్మరాజ‌శేఖ‌ర్ ను, జీరోగా కుమార్ సాయి పేర్లు పేర్కొన్నారు. అమ్మ‌రాజ‌శేఖ‌ర్..హీరోగా నోయ‌ల్ ను, జీరోగా దేవిని, దివి..హీరోగా అమ్మరాజ‌శేఖ‌ర్, జీరోగా కుమార్ సాయి పేర్లు చెప్ప‌గా, అభిజిత్..హీరోయిన్ గా గంగ‌వ్వను, జీరోగా అరియానాను చెప్ప‌కొచ్చారు. ఈ క్ర‌మంలో దివి మాట్లాడుతూ..ఇంట్లో అమ్మ‌రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ లేక‌పోతే అంద‌రికీ మెంటలెక్కిపోతుంద‌ని, ఆయ‌న ప్ర‌వ‌ర్త‌ని ఎవ‌రికీ త‌ప్ప‌నిపించ‌లేద‌ని చెప్పుకొచ్చింది. త‌న ఫొటో కోసం మాస్ట‌ర్ పిల్లో పెట్ట‌డం త‌ప్పు కాద‌ని చెప్పింది. అంద‌రి ముందు త‌న గురించి మాట్లాడిన లాస్య‌పై మండిప‌డ్డ దివి..ష‌ట‌ప్, నీతో మాట్లాడాల్సిన అవ‌స‌రం లేదంటూ చెప్పి వెళ్లిపోయింది. వెంట‌నే లాస్య నోరు అదుపులో పెట్టుకో అంటూ దివిని హెచ్చ‌రించింది. ఆ త‌ర్వాత బిగ్ బాస్ హౌజ్ నుంచి క‌రాటే క‌ళ్యాణి ఎలిమినేట్ అవుతున్నట్టు నాగార్జున ప్ర‌క‌టించ‌గానే..కంటస్టెంట్లంతా క‌ళ్యాణిని ఇంట్లో నుంచి సాగ‌నంపారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.