మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 07, 2020 , 09:08:26

మాస్ట‌ర్ కొత్త రూల్స్.. హౌజ్‌మేట్స్‌కు మైండ్ బ్లాక్

మాస్ట‌ర్ కొత్త రూల్స్.. హౌజ్‌మేట్స్‌కు మైండ్ బ్లాక్

బిగ్ బాస్ హౌజ్ లో తొలిసారి కెప్టెన్ పీఠాన్ని అందుకున్న అమ్మ రాజ‌శేఖ‌ర్ ఇంట్లోరూల్స్ మొత్తం మార్చేశాడు. మైకు మ‌ర్చిపోతే జైలుకు పంపిస్తానన్నాడు. నిద్ర పోతే బెడ్‌రూమ్ మొత్తం శుభ్రం చేయాల‌ని ఆదేశించాడు. ఇంగ్లీషులో మాట్లాడితే త‌న‌కు న‌చ్చినంత సేపు నిల‌బెడ‌తాన‌న్నాడు.సోహైల్, అభిజిత్, అఖిల్‌లు ముగ్గురూ ఉదయం టిఫిన్ చేయాలని అలాగే కిచెన్‌ని క్లీన్ చేసి పెట్టాల‌ని అన్నారు. 

మధ్యాహ్నం లాస్య, హారిక, మోనాల్ ముగ్గురు లంచ్ ప్రిపేర్ చేయాలని  మాస్టర్ అన్నారు. మార్నింగ్ టిఫిన్ చేసిన వాళ్లే నైట్ కూడా డిన్నర్ చేస్తారని చెప్పారు. ఇక అసిస్టెంట్‌గా అరియానాని నియ‌మించుకున్న మాస్ట‌ర్ ఎవ‌రు ఏం చేయ‌క‌పోయిన త‌న‌కి వ‌చ్చి చెబుతుంద‌ని అన్నాడు.  మెహబూబ్, అవినాష్ బాత్ రూంలు క్లీన్ చేయాలని ఆదేశించారు. అయితే మాస్ట‌ర్ పెట్టిన  రూల్స్ సరిగ్గా లేవ‌ని ఇంటి స‌భ్యులు వాదించారు. హారిక అయితే తాను చేయ‌న‌ని వెళ్లిపోయింది కూడా. 

ఇక ఇంటి  ప‌నుల విష‌యంలో అఖిల్‌, మెహ‌బూబ్‌కు మ‌ధ్య కొద్ది సేపు చ‌ర్చ జ‌ర‌గ‌గా, ఆ త‌ర్వాత అభిజిత్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్ వాదించుకున్నారు. కొద్ది సేప‌టి త‌ర్వాత ఈ విష‌యంపై అఖిల్, లాస్య‌, హారిక‌ల‌తో అభిజిత్ డిస్క‌స్ చేస్తూ ఇంగ్లీష్‌లో మాట్టాడాడు. దీంతో అతనికి కెప్టెన్ ప‌నిష్‌మెంట్ ఇచ్చాడు. త‌ను చెప్పేంత‌వ‌ర‌కు నిలుచోమ‌ని చెప్ప‌డంతో త‌ప్పక నిలుచున్నాడు అభి. ఆ త‌ర్వాత ఇంట్లో క్లోజ్ ఫ్రెండ్స్ గా ఉన్న మెహ‌బూబ్, సోహైల్‌లు గొడ‌వ‌ప‌డ్డారు. ఓ విష‌యంలో నీ ఫ్రెండ్షిప్ వ‌ద్ద‌ని మెహ‌బూబ్ అన‌డంతో చాలా హ‌ర్ట్ అయిన సోహైల్ ర‌చ్చ చేశాడు. అన్నింటిని త‌న్నుకుంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. అఖిల్‌, అవినాష్‌లు  ఇద్ద‌రిని క‌లిపే ప్ర‌య‌త్నం చేశారు. మొత్తానికి  అమ్మ కెప్టెన్సీలో హౌజ్ అంతా ర‌ణ‌రంగంగా మారింది. 


logo