మంగళవారం 26 జనవరి 2021
Cinema - Nov 07, 2020 , 08:49:00

ఇంటి కెప్టెన్‌గా మాస్ట‌ర్.. ఒక్కొక్క‌రికి చుక్క‌లు చూపిస్తున్న అమ్మ‌

ఇంటి కెప్టెన్‌గా మాస్ట‌ర్.. ఒక్కొక్క‌రికి చుక్క‌లు చూపిస్తున్న అమ్మ‌

బిగ్ బాస్ సీజ‌న్ 4లో 62వ ఎపిసోడ్ అంతా అల్ల‌ర్ల‌తోనే సాగింది. రాజ‌శేఖ‌ర్ కెప్టెన్ కాగా, ఆయ‌న పెట్టిన రూల్స్ కి ఇంటి స‌భ్యులు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ఇక ఇంగ్లీష్‌లో మాట్లాడినందుకు రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్‌.. అభిజిత్‌కు ప‌నిష్మెంట్ ఇచ్చారు. అవినా్‌ష రేష‌న్ మేనేజ‌ర్ ప‌దవి అందుకున్నాడు. శుక్రవారం బిగ్ బాస్ హౌజ్‌లో జ‌రిగిన విష‌యాల‌పై ఓ లుక్కేస్తే.. ఉద‌యాన్నే సాంగ్‌తో నిద్ర లేపిన బిగ్ బాస్ కెప్టెన్సీ పోటీ కోసం రింగులో రంగు అనే టాస్క్ ఇచ్చారు.  ఈ టాస్క్‌లో అరియానా, అమ్మ రాజ‌శేఖ‌ర్, హారిక పాల్గొన్నారు.

రింగులో రంగు టాస్క్ ప్ర‌కారం పోటీ దారులు ముగ్గురు త‌మ చేతుల‌ని రంగులో ముంచాలి. క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టుకొని ఎదుటివారి వీపుపై రంగు అంటించాలి. చివ‌ర‌కు ఎవ‌రి వీపుపై త‌క్కువ రంగు ఉంటుందో వారు విజేత‌లుగా నిలుస్తారు. అయితే ఈ టాస్క్ మాస్ట‌ర్ అద్భుతంగా ఆడ‌డంతో అతనికి కెప్టెన్ అవ‌కాశం ద‌క్కింది. బిగ్ బాస్ హౌజ్‌కి కెప్టెన్ అయిన అమ్మా రాజ‌శేఖ‌ర్ ఏదో క్రికెట్ టీంకి అయినంత గొప్ప‌గా ఫీలై స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడు. 

అవినాష్‌ని రేష‌న్ మేనేజ‌ర్‌గా నియ‌మించిన అమ్మా ఆ త‌ర్వాత ప‌నిష్మెంట్‌ల‌కు సంబంధించిన వివ‌రాలు తెలియ‌జేశాడు.  నిద్ర పోయిన‌, ఇంగ్లీష్‌లో మాట్లాడిన‌, మైక్ ధ‌రించ‌కపోయిన కూడా క‌ఠిన శిక్ష‌లు ఉంటాయ‌ని పేర్కొన్నాడు. అయితే ఓ సంద‌ర్భంలో మాస్ట‌ర్ మైక్ ధ‌రించ‌క‌పోవ‌డంతో బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు. కొద్ది సేప‌టికి హ‌ల్వా చేయాలంటూ మోనాల్‌, లాస్య‌ల‌కు బిగ్ బాస్ ఆదేశించ‌గా ఇద్ద‌రు అద్భుతంగా చేయ‌డంతో వారిద్ద‌రిని విజేత‌లుగా ప్ర‌క‌టించారు కెప్టెన్ రాజ‌శేఖ‌ర్.


logo