మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 17, 2020 , 15:36:47

అర‌గుండు చేయించుకున్న అమ్మ రాజ‌శేఖ‌ర్

అర‌గుండు చేయించుకున్న అమ్మ రాజ‌శేఖ‌ర్

బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 4లో అమీతుమీ’ పేరుతో  కెప్టెన్ పోటీదారుల కోసం అరియానా( రెడ్‌), అఖిల్(బ్లూ) టీంల మధ్య హోరా హోరీగా పోరు న‌డిచిన సంగ‌తి తెలిసిందే.  ఈ పోటీలో ఒంటిమీద బట్టలు కత్తిరించుకోవడం.. తమ వస్తువుల్ని త్యాగం చేయడం.. జుట్టుకత్తిరించుకోవడం.. ఇసుక బస్తాని ఒక్క చేత్తో బ్యాలెన్స్ చేయడం.. గుడ్లు, పాలుతో పాటు ఇంకా మూడు నాలుగు రకాల పదార్థాలతో చేసిన జ్యూస్ తాగడం.. లాంటి డీల్‌లను కంప్లీట్ చేశారు. అయితే  ఓడీల్‌లో త‌ల‌, గ‌డ్డం షేవ్ చేసుకోవల్సి ఉండ‌గా, ఇందుకు 40 బంగారు నాణేలు చెల్లించాల‌ని అని బిగ్ బాస్ తెలిపారు.

ఈ డీల్‌ని కంప్లీట్ చేసేందుకు అమ్మ రాజ‌శేఖ‌ర్ మొద‌ట ఆస‌క్తి చూపినప్ప‌టికీ, ఆ త‌ర్వాత విర‌మించుకున్నాడు. షేవ్ చేయించుకుంటే కెప్టెన్ కాము, పోటీదారునిలో ఒక‌రిగా ఉంటాం అని అభిజిత్ స‌ల‌హా ఇవ్వ‌డంతో కాస్త వెనుక‌డుగు వేశాడు. ఈ విష‌యాన్ని ఈ రోజు ఎపిసోడ్‌లో ప్ర‌స్తావించిన నాగార్జున .. బ్లూ టీం మీరొక డీల్ పూర్తి చేయ‌లేదు. ఇప్పుడు మీకొక పెద్ద ఆఫ‌ర్ ఇస్తున్నాను. మీలో ఎవ‌రైన ముందుకొచ్చి హాఫ్ షేవ్ చేయించుకుంటే కెప్టెన్సీ పోటీదారుడు కాకుండా, వ‌చ్చే వారం నామినేష‌న్స్ నుండి సేఫ్ అయ్యే బంప‌ర్ ఆఫ‌ర్ పొందుతారు అని అన్నారు. 

దీంతో బ్లూటీంలో ఉన్న అమ్మ రాజ‌శేఖ‌ర్ తాను చేయించుకుంటాన‌ని చెప్పాడు. కెప్టెన్ నోయ‌ల్ స్టోర్ రూంలో ఉన్న ట్రిమ్మ‌ర్‌ను తీసుకొచ్చి మాస్టార్‌కు అర‌గుండు చేశారు. దీంతో అంతా  షాక్ అయ్యారు. దివి  నో అని చెప్పొచ్చు క‌దా మాస్టారు అంటూ ఏడ్చేసింది.  తాజాగా విడుద‌లైన ప్రోమో ప్రేక్ష‌కుల‌లో చాలా ఆస‌క్తిని క‌లిగించింది. 


logo