శనివారం 05 డిసెంబర్ 2020
Cinema - Oct 23, 2020 , 08:42:55

నోయ‌ల్‌, మాస్ట‌ర్‌ల మ‌ధ్య చిచ్చు పెట్టిన అభిజిత్

నోయ‌ల్‌, మాస్ట‌ర్‌ల మ‌ధ్య చిచ్చు పెట్టిన  అభిజిత్

బిగ్ బాస్ సీజ‌న్‌4కు సంబంధించి ప్ర‌సార‌మైన 47వ ఎపిసోడ్‌లో రాజశేఖ‌ర్ మాస్ట‌ర్, నోయ‌ల్ చిన్న విష‌యాన్ని పెద్ద‌దిగా చేసుకొని ఎడ‌మొఖం పెడ‌మొఖం పెట్టుకున్నారు. అయితే దీనికి కార‌ణం అభిజిత్ అని చెప్ప‌వ‌చ్చు. అంద‌రు క‌లిసి స‌ర‌దాగా మాట్లాడుకుంటున్న స‌మ‌యంలో అభిజిత్.. మాస్ట‌ర్ మిమ్మ‌ల్ని నోయ‌ల్ నామినేట్ చేసిన‌ప్పుడు ఎలా ఫీల‌య్యారు అని అడిగాడు. దీనికి న‌వ్వుతూనే స‌మాధానం ఇచ్చిన మాస్ట‌ర్ గ‌తాల‌ని గుర్తు చేసుకుంటూ గొడ‌వ‌కు దిగారు.

నోయ‌ల్‌కు నేనొక సాంగ్ రాసివ్వ‌మంటే రాసివ్వ‌లేదు. ఇచ్చిన ప్రామిస్‌కు ఆయ‌న క‌ట్టుబ‌డి ఉండ‌డు అని రాజ‌శేఖ‌ర్ అన్నాడు. దీనికి నోయ‌ల్‌.. నేను రాసిచ్చా, పాట కూడి రిలీజ్ అయింది. ఈ సాంగ్‌కు సంబంధించి డ‌బ్బులు కూడా అడగ‌లేదు అంటూ అస‌హ‌నం వ్యక్తం చేశాడు. అయితే ప్ర‌శాంతంగా ఉన్న వారిద్ద‌రి మ‌ధ్య అభిజిత్ చిచ్చు పెట్ట‌డంతో నోయ‌ల్ అభిపై ఫైర్ అయ్యాడు. ఇప్పుడు సంతోషంగా ఉందా అని అన్నాడు. ఒకానొక సంద‌ర్భంలో రాజ‌శేఖ‌ర్ మాస్ట‌ర్ .. నోయ‌ల్‌ను ఉద్దేశించి అత‌ను ఇక్క‌డ కెమెరాల ముందు న‌టిస్తున్నాడు. బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు కూడా ఇంట‌ర్వ్యూలో ఇవే చెప్తాను అంటూ నోయ‌ల్‌పై త‌న అస‌హనం ప్ర‌ద‌ర్శించాడు అమ్మ‌.

ఇక రాత్రి ఇంటి కెప్టెన్‌గా ఉన్న నోయ‌ల్ ఎవ‌రెవ‌రు ఇంటి ప‌నులు ఎలా చేయాల‌నే దానిపై ఓ మీటింగ్ పెట్టాడు. తెల్లారి గార్డెన్ ఏరియాలో కూర్చున్న సోహైల్‌..రాజ‌శేఖ‌ర్, దివిల‌తో కాసేపు ముచ్చటించాడు. ఓ సంద‌ర్భంలో మాస్ట‌ర్ ఈ వ‌య‌స్సులో కూడా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు అని అన్నాడు. దీంతో దివి తెగ ఫీల‌య్యి అక్క‌డ నుండి లేచి వెళ్ళిపోయింది. గ‌ర్ల్ ఫ్రెండ్ ప‌క్క‌న ఉన్న‌ప్పుడు ఇలా అంటావారా, న‌న్ను అన‌గానే దివి లేచి వెళ్లిపోయింద‌ని సోహైల్‌తో చెప్పుకొచ్చాడు అమ్మ‌. అనంతరం అఖిల్- మోనాల్ మ‌ధ్య స‌ర‌దాగా కాసేపు చ‌ర్చ జ‌రిగింది. త‌న భ‌ర్త న‌టుడు అని, మ‌ల్టీ టాలెంటెడ్ అని, త‌న‌ను బాగా చూసుకుంటాడు అంటూ కొద్ది సేపు అఖిల్‌తో ముచ్చ‌టించింది.