శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 07, 2020 , 09:34:22

షూటింగ్‌లో పాల్గొన్న అమితాబ్..వివ‌ర‌ణ ఇచ్చిన బిగ్ బీ

షూటింగ్‌లో పాల్గొన్న అమితాబ్..వివ‌ర‌ణ ఇచ్చిన బిగ్ బీ

లాక్‌డౌన్ వ‌ల‌న షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ప్ర‌తి ఒక్కరు ఇళ్ళ‌కే ప‌రిమిత‌మ‌య్యారు. కాని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ మాత్రం  ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ (కేబీసీ) షో ప్రోమో కోసం  షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ విష‌యం బ‌య‌టకి రావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. దీనిపై తాజాగా స్పందించిన అమితాబ్.. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొనే షూటింగ్‌లో పాల్గొన్నాం. రెండు రోజుల‌లో చేయ‌వ‌ల‌సింది ఒక్క రోజులోనే పూర్తి చేశాం అని పేర్కొన్నారు.

ఒకే రోజు జ‌రిగిన షూటింగ్‌లో అమితాబ్ దాదాపు 12 వీడియోల‌లో న‌టించార‌ట‌. కేబీసీ 12 ప్రోమోతో పాటు కరోనా చికిత్స కోసం పోరాడుతున్న డాక్టర్లు, నర్సులను ప్రోత్సహించే వీడియోల‌లో కూడా న‌టించార‌ని స‌మాచారం. మే 9 న రాత్రి 9గం.ల నుండి ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి రిజిస్ట్రేష‌న్  ప్రారంభం కానుంది. ఈ షోని ఎలా నిర్వ‌హించాల‌నే దానిపై ప్ర‌స్తుతం నిర్వాహ‌కులు ఆలోచ‌న‌లు చేస్తున్నారు. అతి త్వ‌ర‌లోనే ఈ షో సోనీ టీవీలో ప్ర‌సారం కానుంది.


logo