శుక్రవారం 05 జూన్ 2020
Cinema - Mar 18, 2020 , 17:05:10

చేతికి ‘హోం క్వారంటైన్‌ స్టాంప్‌’..ఫ్యాన్స్‌కు బిగ్‌బీ సూచనలు

చేతికి ‘హోం క్వారంటైన్‌ స్టాంప్‌’..ఫ్యాన్స్‌కు బిగ్‌బీ సూచనలు

 కరోనా వైరస్‌ నియంత్రణలో  భాగంగా మహారాష్ట్ర ప్రభుత్వం అనుమానిత లక్షణాలున్న వ్యక్తుల ఎడమచేతికి హోం క్వారంటైన్‌ స్టాంప్‌ వేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ..జాగ్రత్తలు తీసుకునేలా షురూ చేసిన ‘హోం క్వారంటైన్‌ స్టాంప్‌ ’  క్యాంపెయిన్‌ తో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ చేతులు కలిపారు. హోం క్వారంటైన్‌ స్టాంప్‌ వేసి ఉన్న తన ఎడమచేతిని ఫొటో తీసి ట్విట్టర్‌ పోస్ట్‌ చేశారు బిగ్‌ బీ.

ముంబైలో ఓటర్‌ ఇంక్‌తో స్టాంప్‌ వేయడం ప్రారంభించారు. జాగ్రత్తగా..అప్రమత్తంగా ఉండండి. ఒకవేళ వైరస్‌ లక్షణాలు గుర్తిస్తే ఒంటరిగా ఉండండి. డాక్టర్లను సంప్రదించండి అంటూ ట్వీట్‌ చేశారు. అనుమానిత వ్యక్తులకు అవగాహన కల్పించేలా హోం క్వారంటైన్‌ స్టాంప్‌ కార్యక్రమాన్ని ప్రమోట్‌ చేస్తున్న అమితాబ్‌కు బీఎంసీ ట్విట్టర్‌ ద్వారా ధన్యవాదాలు తెలియజేసింది. ఇటీవలే కరోనా పరిస్థితులపై బిగ్‌ బీ ఓ పద్యాన్ని ట్విట్టర్‌లో షేర్‌ చేసిన విషయం తెలిసిందే. 
logo