శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 04, 2020 , 15:35:44

త‌న ఫ్రెండ్‌కు స్మార్ట్‌గా స‌మాధానం ఇచ్చిన బిగ్ బీ

త‌న ఫ్రెండ్‌కు స్మార్ట్‌గా స‌మాధానం ఇచ్చిన బిగ్ బీ

77 ఏళ్ళ వ‌య‌స్సులో క‌రోనాను జ‌యించిన అమితాబ్ బ‌చ్చ‌న్ ప్ర‌స్తుతం షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. రోజులో 14 గంట‌లు పనికి కేటాయిస్తున్న‌ట్టు ఇటీవ‌ల త‌న సోష‌ల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. అమితాబ్ అంకిత‌భావానికి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. అయితే ‌‘కౌన్‌ బనేగా కరోర్‌పతి’ 12 వ సీజన్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అమితాబ్ ..ఈ షోకు సంబంధించి రెగ్యుల‌ర్ అప్‌డేట్స్ ఇస్తూ వ‌స్తున్నారు. ఎంత సేపు వ‌ర్క్ చేస్తున్నారు, ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు, కంటెస్టెంట్‌కు సంబంధించిన విశేషాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు త‌న సోష‌ల్ మీడియాలో అప్‌డేట్ చేస్తున్నాడు బిగ్ బీ.

తాజాగా అమితాబ్ పెట్టిన పోస్ట్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. ఇందులో కూల్ పిక్స్ షేర్ చేసిన పెహ‌న్ షా .. నా స్నేహితుడు ఒక‌రు.. అమిత్ జీ న‌న్ను విస్మ‌రిస్తున్నావు అని అన్నారు. అందుకు నేను 12 గంటల నుండి 15 గంట‌లు ప‌ని చేసిన త‌ర్వాత నాకు గుర‌క పెట్ట‌డానికే స‌మ‌యం దొర‌కుతుంది, మ‌ర‌చిపోడానికి కాదు అంటూ చాలా స్మార్ట్‌గా బ‌దులిచ్చారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెటిజ‌న్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.