మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 06, 2020 , 11:06:53

కేబీసీలో తెలంగాణ టీచర్.. ఆమె లైఫ్ జ‌ర్నీకు బిగ్ బీ ఫిదా

కేబీసీలో తెలంగాణ టీచర్.. ఆమె లైఫ్ జ‌ర్నీకు బిగ్ బీ ఫిదా

బుల్లితెర బిగ్ రియాలిటీ షో కౌన్ బ‌నేగా క‌రోర్ ప‌తి కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా 11 సీజ‌న్స్ పూర్తి చేసుకొని 12వ సీజ‌న్‌లోకి అడుగుపెట్టింది. అమితాబ్ బచ్చ‌న్ హోస్ట్‌గా రూపొందుతున్న ఈ షో  మంచి టీఆర్పీ రేటింగ్స్‌తో దూసుకుపోతుంది. ఇటీవ‌లే సీజ‌న్ 12 ప్రారంభం కాగా, సోమ‌వారం ఎపిసోడ్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వారిలో ముందుగా బ‌జ‌ర్ మోగించి స‌మాధానం చెప్పిన ప్ర‌దీప్ కుమార్ సూద్ హాట్ సీట్‌లో కూర్చొని గేమ్ ఆడారు. పంజాబ్‌కు చెందిన అమృత్‌స‌ర్ నుండి వ‌చ్చిన ప్ర‌దీప్ 12.5 లక్షల ప్రైజ్‌ మనీ  గెలుచుకుని ఆట నుంచి క్విట్ అయ్యారు. కేబీసీలో పాల్గొనడం తన తల్లి కోరిక కాగా, ఇది సుసాధ్యం అయినందుకు సంతోషంగా ఉంద‌ని అన్నారు ప్ర‌దీప్.

ప్ర‌దీప్ త‌ర్వాత హాట్ సీట్‌లో కూర్చొని అమితాబ్‌తో ఆడే అవ‌కాశం తెలంగాణ ప్రాంతంలోని ఆల్వాల్‌కు చెందిన స‌బితా రెడ్డికి ద‌క్కింది. టీచ‌ర్‌గా ప‌ని చేస్తున్న స‌బితాకు సంబంధించిన లైఫ్ జ‌ర్నీని వీడియో ద్వారా చూపించ‌గా, ఆమె స్పూర్తివంత‌మైన లైఫ్ జ‌ర్నీని చూసి అమితాబ్ ఎమోష‌న‌ల్ అయ్యారు. భ‌ర్త చ‌నిపోయిన త‌ర్వాత తానే పిల్ల‌ల‌ని చ‌దివించి పెద్ద చేయ‌డం బిగ్ బీ మ‌న‌సుని ఎంత‌గానో క‌దిలించింది. పిల్ల‌ల‌కు ఆస్తులు ఇవ్వ‌లేకున్నా, మంచి విద్య‌ను మాత్రం అందిస్తున్నానంటూ పేర్కొంది. మంగ‌ళ‌వారం రాత్రి స‌బిరా రెడ్డికి సంబంధించిన గేమ్ షో సోనీ టీవీలో ప్ర‌సారం కానుంది.


logo