శనివారం 26 సెప్టెంబర్ 2020
Cinema - Aug 15, 2020 , 09:02:35

క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత‌.. తొలిసారి బ‌య‌ట‌కు వ‌చ్చిన బిగ్‌బీ

క‌రోనా నుంచి కోలుకున్న త‌ర్వాత‌.. తొలిసారి బ‌య‌ట‌కు వ‌చ్చిన బిగ్‌బీ

ఏడు ప‌దుల వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ గ‌త నెల‌లో క‌రోనా బారిన ప‌డిన సంగ‌తి తెలిసిందే. అమితాబ్‌కు అనేక ఆరోగ్య సమ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ క‌రోనాని ధైర్యంగా జ‌యించారు. ఇటీవలే గ‌త వారంలో ఆయ‌న‌కు ప‌రీక్ష జ‌ర‌ప‌గా, నెగెటివ్ రావ‌డంతో డిశ్చార్జ్ చేశారు. అప్ప‌టి నుండి ఇంట్లోనే ఉంటున్న అమితాబ్ క‌రోనాని జ‌యించిన త‌ర్వాత తొలిసారి బ‌య‌ట‌కు వ‌చ్చారు.

త‌న ఇంటి ఆవ‌ర‌ణ‌లో కొన్ని ద‌శాబ్ధాల క్రింద నాటిన వృక్షం ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల వ‌ల‌న నేల‌కొరిగింది. దీంతో అదే ప్రాంతంలో మ‌రో చెట్టును నాటి వాటితో ఫోటోలు దిగి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. భారీ గుల్ మెహ‌ర్ చెట్టును 1976లో నా ఇల్లు ప్ర‌తీక్ష‌లో స్వ‌యంగా నేనే నాటాను. అది ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు నెల‌కొరిగింది. ఆగ‌స్ట్ 12న మా అమ్మ‌గారి పుట్టిన రోజు సంద‌ర్భంగా  చెట్టు ప‌డిన ప్రాంతంలోనే అమ్మ తేజి బ‌చ్చ‌న్ పేరుతో కొత్త గుల్‌మోహ‌ర్ చెట్టును నాటాను అని త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు అమితాబ్

logo