శుక్రవారం 30 అక్టోబర్ 2020
Cinema - Oct 12, 2020 , 12:08:37

ముంబైలో బ్లాకౌట్.. స్పందించిన అమితాబ్

ముంబైలో బ్లాకౌట్.. స్పందించిన అమితాబ్

ముంబై మ‌హాన‌గ‌రం స్తంభించింది. గ్రిడ్ ఫెయిల్యూర్ స‌మ‌స్య వ‌ల‌న ముంబై అంత‌టా విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోవ‌డంతో రైళ్ళు ఆగిపోయాయి. కార్యాల‌యాల‌లో ప‌నులకి బ్రేక్ ఏర్ప‌డింది. న‌గ‌ర ప్ర‌జ‌లు విద్యుత్ స‌మ‌స్య‌పై త‌మ ట్విట్ట‌ర్ ద్వారా పోస్ట్‌లు పెడుతున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా బ్లాకౌట్ విష‌యంపై స్ప‌దించారు.

ముంబై సిటీ మొత్తానికి  విద్యుత్ అంత‌రాయం ఏర్ప‌డింది. అయిన‌ప్పటికీ ఏదో విధంగా ట్వీట్ చేస్తున్నా. ప్ర‌శాంతంగా ఉండండి, ప‌రిస్థితులు మెరుగ‌వుతాయి. డోంగిల్స్ ప‌ని చేశాయి.వోడాఫోన్ నా కోసం ప‌ని చేస్తుంది అని అమితాబ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.  

బ్లాకౌట్ స‌మ‌స్య వ‌ల‌న విద్యుత్‌కు అంత‌రాయం ఏర్ప‌డడంతో ఎల‌క్ట్రిక్ రైళ్ళు ఎక్క‌డిక‌క్క‌డ ఆగిపోయాయి. ఆఫీసులకు వెళ్ళే వారు చేసేదేం లేక  కాలి బాట ప‌ట్టారు. విద్యుత్ అంత‌రాయం వ‌ల‌న ర‌వాణా వ్య‌వ‌స్థ‌కు ఆటంకం క‌ల‌గ‌డంతో యూజీ, పీజీ ప‌రీక్ష‌ల‌ను ఆదివారానికి వాయిదా వేశారు.  అయితే మ‌ధ్యాహ్నం 12.30ని.ల వ‌ర‌కు విద్యుత్‌ను పున‌రుద్ధ‌రిస్తామ‌ని ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్  చెబుతున్నారు.