శనివారం 30 మే 2020
Cinema - May 09, 2020 , 08:39:15

ఇర్ఫాన్‌,శ్రీదేవిల‌ని గుర్తు చేసుకున్న అమితాబ్

ఇర్ఫాన్‌,శ్రీదేవిల‌ని గుర్తు చేసుకున్న అమితాబ్

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కో స్టార్స్ శ్రీదేవి, ఇర్ఫాన్ ఖాన్‌ల‌ని గుర్తు చేసుకున్నారు. శ్రీదేవితో న‌టించిన ఖుదా గ‌వా చిత్రం 1992లో విడుదల‌ కాగా, మే 8,2020తో 28 ఏళ్ళు పూర్తి చేసుకుంది. అలానే ఇర్ఫాన్‌తో క‌లిసి 2015లో పీకు చేశారు. ఈ చిత్రం కూడా శుక్ర‌వారంతో ఐదేళ్లు పూర్తి చేసుకుంది.

ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రితో క‌లిసి ఉన్న ఫోటోల‌ని జ‌త చేస్తూ..28 ఏళ్ళ ఖుదా గ‌వా, 5 ఏళ్ల పీకూ.. రెండు చిత్రాలు మే 8న విడుద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం ఈ ఇద్ద‌రి జ్ఞాప‌కాలు మాత్ర‌మే మ‌న‌తో ఉన్నాయి అని పోస్ట్ పెట్టారు అమితాబ్. ఇర్ఫాన్ ఖాన్ ఇటీవ‌ల క్యాన్స‌ర్ కార‌ణంగా క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. శ్రీదేవి త‌న ఫ్యామిలీ ఫంక్ష‌న్ కోసం దుబాయ్ వెళ్లి ఫిబ్ర‌వ‌రి 24,2018న క‌న్నుమూసింది. ఇద్ద‌రు లెజెండ్స్ మ‌నకి భౌతికంగా దూర‌మైన వాళ్ళు మిగిల్చిన సినిమా జ్ఞాప‌కాలు మాత్రం ప్ర‌తి రోజు గుర్తు చేస్తూనే ఉన్నాయి.


logo