గురువారం 02 జూలై 2020
Cinema - Jun 06, 2020 , 09:16:32

క‌లిసి న‌టించని అమితాబ్, మాధురీ.. కారణం ?

క‌లిసి న‌టించని అమితాబ్, మాధురీ.. కారణం ?

బాలీవుడ్ ఇండ‌స్ట్రీ  దిగ్గ‌జాలు అమితాబ్ బ‌చ్చ‌న్, మాధురీ దీక్షిత్‌లు అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రికీ దేశ వ్యాప్తంగా పాపులారిటీ ఉంది. షాకింగ్ విష‌యం ఏమంటే..వీరిద్ద‌రు క‌లిసి ఇంతవ‌ర‌కు ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. మీరు విన్న‌ది నిజ‌మే. వారిద్ద‌రు క‌లిసి న‌టించ‌క‌పోవ‌డానికి ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఉంది. ఇది మ‌నంద‌రిని షాక్‌కి గురి చేస్తుంది. 

80ల‌లో మాధురీ దీక్షిత్ వెండితెర ఎంట్రీ ఇచ్చింది. తొలినాళ్ళ‌లో ఆమెకి సక్సెస్ కరువైంది. ఏ న‌టుడు ఆమెతో క‌లిసి పని చేయ‌డానికి ఆస‌క్తి చూప‌లేదు. అలాంటి స‌మ‌యంలో అనీల్ క‌పూర్ ఓ అడుగు ముందుకేసి మాధురితో క‌లిసి బేటా, తేజాబ్, హిఫాజ‌ట్‌, పరిందా త‌దిత‌ర చిత్రాలు చేశాడు. ఇవి బాక్సాఫీస్ దగ్గ‌ర భారీ విజ‌యం సాధించ‌డ‌మే కాక మాధురీ దీక్షిత్‌ని సూప‌ర్‌స్టార్‌ని చేసింది.

కొద్ది రోజుల త‌ర్వాత మాధురీ దీక్షిత్‌కి అమితాబ్ స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం ద‌క్కింది.  కానీ అనీల్ క‌పూర్ అందుకు నిరాక‌రించాడు. మాధురీకి నేను లైఫ్ ఇచ్చాను కాబ‌ట్టి ఆమె నాతోనే న‌టించాల‌నే కండీష‌న్ పెట్టాడ‌ట‌. ఈ కార‌ణంతోనే మాధురీ దీక్షిత్ ఇప్ప‌టి వ‌ర‌కు అమితాబ్ స‌ర‌స‌న న‌టించ‌లేక‌పోయింది.  అయితే ఆ సంఘ‌ట‌న త‌ర్వాత మాధురీ .. అనీల్ కపూర్‌తోనే ఏ చిత్రం చేయ‌లేదు .  గ‌త ఏడాది  టోట‌ల్ ఢ‌మాల్ అనే చిత్రంలో మెర‌వ‌గా, ఇందులో అనీల్ క‌పూర్, అజ‌య్ దేవ‌గ‌ణ్ ముఖ్య పాత్ర‌లు పోషించారు


logo