శనివారం 04 జూలై 2020
Cinema - Jan 21, 2020 , 01:01:51

ఫుట్‌బాల్‌ శిక్షకుడిగా..

ఫుట్‌బాల్‌ శిక్షకుడిగా..

అమితాబ్‌బచ్చన్‌ ప్రధాన పాత్రలో ‘సైరాట్‌' ఫేమ్‌ నాగరాజ్‌ మంజులే దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జుంద్‌'. సోమవారం అమితాబ్‌బచ్చన్‌ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. స్పోర్ట్స్‌ జెర్సీ ధరించి ముఖం కనిపించకుండా వెనక్కి తిరిగి ఉన్న ఆయన లుక్‌ ఆసక్తిని పంచుతున్నది. ఆయన ముందు ఫుట్‌బాల్‌తో పాటు పాడైపోయిన వ్యాన్‌ ఉండటం ఆకట్టుకుంటున్నది. నాగ్‌పూర్‌కు చెందిన విజయ్‌ బర్సే  స్లమ్‌సాకర్‌ అనే ఎన్జీవోను ఏర్పాటుచేసి మురికివాడలోని పిల్లలకు ఫుట్‌బాల్‌ క్రీడలో మెళకువలను నేర్పించారు. ఆయన  జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతున్నది.  చిన్నారులకు సాకర్‌ క్రీడలో ప్రావీణ్యాన్ని అందించే క్రమంలో విజయ్‌ బర్సేకు ఎదురైన అవరోధాలతో స్ఫూర్తిదాయకంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. నాగరాజ్‌ మంజులే దర్శకత్వం వహిస్తున్న తొలి బాలీవుడ్‌ సినిమా ఇది. 
logo