సోమవారం 06 జూలై 2020
Cinema - Jun 03, 2020 , 12:28:16

47 ఏళ్ళ దాంప‌త్య జీవితం.. బిగ్ బీ పోస్ట్‌

47 ఏళ్ళ దాంప‌త్య జీవితం.. బిగ్ బీ పోస్ట్‌

సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే అమితాబ్ బ‌చ్చ‌న్ సినిమా విష‌యాలనే కాక ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఈ రోజు బిగ్ బీ 47వ వివాహ వార్షికోత్స‌వం సంద‌ర్బంగా పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ .. ఆ నాటి జ్ఞాప‌కాలు పంచుకున్నారు.   

జూన్ 3,1973 స‌రిగ్గా ఇదే రోజు మేం వివాహం చేసుకున్నాం. మా పెళ్ళి జరిగి 47 ఏళ్ళు అయింది. జంజీర్ సక్సెస్ సెల‌బ్రేషన్స్‌లో పాల్గొనేందుకు నేను జ‌య‌, నా ఫ్రెండ్స్‌తో కలిసి తొలిసారి లండ‌న్ బ‌యలుదేరాను. ఈ విష‌యాన్ని నాన్న‌గారితో చెప్పగా, ఎవ‌రెవ‌రు వెళుతున్నారని అడిగారు. జ‌య‌తో వెళుతున్నాను అని చెప్పగా, ఆమెని వివాహం చేసుకొని వెళ్ళు. లేక‌పోతే వెళ్ల‌కు అని అన్నారు. అందుకు ఓకే చెప్పాను. జూన్‌3, 1973న ‌కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో  జ‌య‌ని వివాహం చేసుకున్నారు. అమితాబ్, జ‌య  క‌లిసి ప‌లు చిత్రాల‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. సిసిల‌, అభిమాన్, చుప్కే చుప్కే, మిలి వంటి చిత్రాలు పాపుల‌ర్ అయ్యాయి. logo