శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 14, 2020 , 18:56:13

అమితాబ్‌కు న‌చ్చిన ఫ‌న్నీ వీడియో

అమితాబ్‌కు న‌చ్చిన ఫ‌న్నీ వీడియో

ఎప్పుడూ బిజీగా ఉండే త‌ల్లిదండ్రులు క్వారెంటైన్‌లో పిల్ల‌ల‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డిపే అవ‌కాశం ద‌క్కింది. దీంతో పిల్ల‌లు చేసే ప్ర‌తి అల్ల‌రినీ ఎంజాయ్ చేస్తున్నారు పేరెంట్స్‌. ఇటీవ‌ల క‌వాన్‌, క‌బీర్ అనే ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు చేసిన ఫ‌న్నీ వీడియోకు బాలివుడ్ స్టార్ బిగ్ బీ ఫిదా అయ్యాడు. ఆ వీడియోను ట్విట‌ర్‌లో షేర్ చేశాడు. 'క‌వాన్ లెమ‌న్‌జ్యూస్ తాగి చాలాబాగుంది అని అంటే త‌మ్ముడు క‌బీర్ కూడా అలానే ఇమిటేట్ చేస్తాడు. జ్యూస్‌ తాగిన త‌ర్వాత పెద్దోడు బేవ్‌.. అని  ఎక్స్‌క్యూజ్ మీ అంటాడు. వెంటనే పక్కనున్న బుడ్డోడు కూడా బేవ్‌.. ఎస్‌కుస్‌ మీ అంటూ తేపులు రాక‌పోయినా క్యూట్‌గా అంటాడు. ఈ వీడియోను త‌మ త‌ల్లి జాస్మిన్ ట్విట‌ర్‌లో షేర్ చేస్తూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ను ట్యాగ్ చేసింది. ఈ వీడియో చూసిన బిగ్‌బీ క్యూట్ ఫ‌న్నీ వీడియో అంటూ షేర్ చేశాడు. 


logo