శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Oct 09, 2020 , 12:24:13

ప్ర‌తిష్టాత్మ‌క‌ ప్రాజెక్ట్‌లో భాగం అయినందుకు సంతోషంగా ఉంది: బిగ్ బీ

ప్ర‌తిష్టాత్మ‌క‌ ప్రాజెక్ట్‌లో భాగం అయినందుకు సంతోషంగా ఉంది: బిగ్ బీ

ఏడు ప‌దుల వ‌య‌స్సులోను ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న బాలీవుడ్ షెహ‌న్ షా అమితాబ్ బ‌చ్చన్ సైరా మూవీ త‌ర్వాత తెలుగులో మ‌రో చిత్రం చేస్తున్నారు. ప్ర‌భాస్- నాగ్ అశ్విన్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రంలో అమితాబ్ పూర్తి నిడివి గ‌ల పాత్ర చేయ‌నున్నార‌ట‌. తెలుగు రంగంలో అద్భుత‌మైన చిత్రాల‌ను రూపొందించిన వైజయంతీ మూవీస్‌ సంస్థ  కొద్ది సేప‌టి క్రితం  క్రేజీ ప్రాజెక్ట్‌లో బిగ్ బీ న‌టిస్తున్న విష‌యాన్ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. 

అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో భాగం కావ‌డం సంతోషంగా ఉంది. ఇదొక గౌరవంగా భావిస్తున్నాను. వైజ‌యంతి సంస్థ 50 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంటున్న సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. ఈ సంస్థ మ‌రో  50 సంవ‌త్స‌రాల పాటు స‌క్సెస్‌ఫుల్‌గా సాగాల‌ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అమితాబ్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 

సి. అశ్వినీదత్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో స్వప్నాదత్, ప్రియాంకాదత్‌ సహనిర్మాతలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్రభాస్‌కు జోడీగా దీపికా పదుకోనె నటిస్తున్నారు. కాగా, చిత్రంలో అమితాబ్ న‌టించ‌డంపై సంతోషం వ్య‌క్తం చేసిన ప్ర‌భాస్ `ఎట్టకేలకు నా కల నిజం కాబోతోంది. దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించబోతున్నాన`ని  ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పేర్కొన్నాడు. `లెజెండ్ అమితాబ్ బచ్చన్ లేకుండా లెజెండరీ సినిమాను ఎలా తెరకెక్కించగలం` అని వైజయంతీ మూవీస్ సంస్థ పేర్కొంది. 2022లో చిత్రం విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది.