సోమవారం 01 జూన్ 2020
Cinema - May 14, 2020 , 16:07:43

అమెజాన్‌ ప్రైమ్‌లో అమితాబ్‌ 'గులాబో సితాబో'

అమెజాన్‌ ప్రైమ్‌లో అమితాబ్‌ 'గులాబో సితాబో'

ముంబై: లాక్‌డౌన్‌ నేపథ్యంలో థియేటర్లలో సినిమాల విడుదల నిలిచిపోయి 50 రోజులు దాటిపోయాయి. కొత్త సినిమాలు విడుదల చేద్దామన్నా.. ప్రేక్షకులు కరువవుతారన్న బెంగ నిర్మాతలకు పట్టుకొన్నది. దాంతో లాక్‌డౌన్‌ ఎప్పుడు ఎత్తివేస్తారా? ఎప్పుడు తమ సినిమాలను రిలీజ్‌  చేయాలా? అంటూ ఎందరో నిర్మాతలు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్‌కు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా  ఉన్న చాలా సినిమాలు.. థియేటర్లను కాకుండా అమెజాన్‌ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌, సన్‌ ఎన్‌ఎక్స్‌టీ, ఓటీటీ  వంటి మాధ్యమాలను ఎంచుకొంటున్నాయి.

తాజాగా అమితాబ్‌ బచ్చన్‌, ఆయుష్మాన్‌ ఖురానా కీలక పాత్రల్లో నటించిన 'గులాబో సితాబో' సినిమాను కూడా అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ సినిమా గత నెల 17న థియేటర్లలో రావాల్సి ఉండగా.. లాక్‌డౌన్‌ కారణంగా  వాయిదా పడింది. తాజాగా వచ్చే నెల 12 న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానున్నది. ఈ సినిమాలో వృద్ధుడి పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌, సితాబో పాత్రలో ఆయుష్మాన్‌ ఖురానా నటిస్తున్నారు. 


logo