ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Cinema - Aug 10, 2020 , 13:38:21

అమితాబ్‌కు జాబిచ్చిన అభిమాని..!

అమితాబ్‌కు జాబిచ్చిన అభిమాని..!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కొన్ని ద‌శాబ్ధాలుగా వెండితెర‌పై అల‌రిస్తూ వ‌స్తున్నారు. కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి లాంటి షోస్‌కి హోస్ట్‌గా ఉన్నారు. ప‌లు ప్ర‌క‌ట‌న‌ల‌లో న‌టించారు. మ‌రి ఇంత బిజీ స్టార్ ఎంత సంపాదించి ఉంటార‌నే దానిపై పెద్ద క్లారిటీ ఇవ్వ‌న‌క్క‌ర్లేద‌నుకుంటా! అయితే కరోనా కారణంగా త‌న‌కు ప‌ని దొరుకుతుందో లేదో అని ఆ మ‌ధ్య ఆందోళ‌న వ్య‌క్తం చేసిన నేప‌థ్యంలో బిగ్ బీ అభిమాని ఒక‌రు అమితాబ్‌కి జాబ్ ఆఫ‌ర్ చేశార‌ట‌. ఈ విష‌యాన్ని అమితాబ్ త‌న బ్లాగ్ లో చెప్పుకొచ్చారు.

క‌రోనా వ‌ల‌న కొద్ది రోజుల క్రితం మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం 65 ఏళ్లు పైబడిన నటులు టీవీ, సినిమా షూటింగ్‌ల‌లో పాల్గొన‌కూడ‌ద‌ని ఉత్వ‌ర్వులు జారీ చేసింది. దీనిని ముంబై కోర్ట్ వివ‌క్ష‌పూరిత‌మైన‌దిగా చెప్పుకొచ్చింది. అయితే మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల‌తో ఆందోళ‌న చెందిన అమితాబ్‌కి జాబ్ ఆఫ‌ర్ ఇచ్చారట‌. ప్రియమైన అమితాబ్ , శాశ్వత కారణాల వల్ల ప్రత్యామ్నాయ ఉద్యోగం కోసం మీ దరఖాస్తు తాత్కాలికంగా సమీక్షలో ఉందని మీకు తెలియజేయడానికి మేము సంతోషిస్తున్నాము అంటూ త‌న అభిమాని లెట‌ర్ రాశార‌ట‌.  ఇందుకు సంతోషించిన అమితాబ్ త‌న జాబ్ ప‌క్కా అయింద‌ని చెప్పుకొచ్చారు. కాగా, క‌రోనా బారిన ప‌డ్డ అమితాబ్ ఇటీవ‌ల కోలుకొని ఆసుప‌త్రి నుండి డిశ్చార్జ్ అయిన విష‌యం తెలిసిందే.


logo