శుక్రవారం 10 జూలై 2020
Cinema - Jun 03, 2020 , 23:14:27

నాన్న మాటను పాటించా

నాన్న మాటను పాటించా

హిందీ చిత్రసీమలో అమితాబ్‌బచ్చన్‌, జయాబచ్చన్‌లది అన్యోన్య దాంపత్యంగా అభివర్ణిస్తుంటారు.  వీరి వివాహం జరిగి నలభై ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా పెళ్లినాటి మధురజ్ఞాపకాల్ని ట్విట్టర్‌ ద్వారా బుధవారం అభిమానులతో పంచుకున్నారు అమితాబ్‌బచ్చన్‌. పెళ్లి ఫోటోలను షేర్‌ చేసిన ఆయన తన తండ్రి హరివంశ్‌రాయ్‌బచ్చన్‌ ఆదేశాలను పాటించి జయాబచ్చన్‌ను  పెళ్లాడానని పేర్కొన్నారు.  ‘నలభై ఏడు ఏళ్ల క్రితం  జూన్‌ 3  1973లో మా వివాహం జరిగింది.

‘జంజీర్‌' సినిమా విజయవంతమైన తర్వాత కొద్ది మంది స్నేహితులతో కలిసి లండన్‌లో సక్సెస్‌ వేడుకుల్ని చేసుకోవాలని అనుకున్నా.  ‘ఎవరితో లండన్‌  వెళుతున్నావు’ అని  నాన్న నన్ను అడిగారు.  జయతో వెళ్తున్నానని బదులిచ్చా.  ‘జయను పెళ్లి చేసుకొని నీతో కలిసి లండన్‌ తీసుకెళ్ల్లు లేదంటే వదు’్ద అని నాన్న అన్నారు.ఆయన మాటను పాటిస్తూ వెంటనే పెళ్లి చేసుకున్నా’ అంటూ అమితాబ్‌బచ్చన్‌ తెలిపారు.  తన పెళ్లి  కథను వివరిస్తూ అమితాబ్‌బచ్చన్‌ పెట్టిన ఈ ట్వీట్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. logo