ఆదివారం 07 జూన్ 2020
Cinema - Apr 03, 2020 , 15:49:31

క‌రోనాతో ఫైట్ చేస్తున్న డాక్ట‌ర్స్‌కి కూలీ సాంగ్ అంకితం చేసిన బిగ్ బీ

క‌రోనాతో ఫైట్ చేస్తున్న డాక్ట‌ర్స్‌కి కూలీ సాంగ్ అంకితం చేసిన బిగ్ బీ

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా త‌న‌దైన శైలిలో స్పందిస్తుంటారు. ప్ర‌స్తుతం ప్ర‌పంచం మొత్తం క‌రోనా వైర‌స్ బారిన ప‌డి గిజ‌గిజ‌లాడుతున్న స‌మ‌యంలో బిగ్ బీ సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌తి రోజు ప్ర‌జ‌ల‌లో అవ‌గాహ‌న క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. తాజాగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా గ్లోబ్‌ని ఎత్తుకున్న డాక్ట‌ర్ ఫోటోని షేర్ చేస్తూ.. త‌ను కూలీ చిత్రంలోని సాంగ్ లిరిక్‌ని యాడ్ చేశాడు. సారీ దునియా కా భోజ్ హ‌య్ ఉఠాతే హై( ప్రపంచం మొత్తం భారాన్ని మేము భరిస్తాము…) అనే కామెంట్ పెట్టారు.

ప్ర‌స్తుతం విశ్రాంతి లేకుండా క‌రోనాతో ఫైట్ చేస్తున్న వైద్యుల‌పై జ‌ర‌గుతున్న దాడుల‌ని ఖండిస్తూ బిగ్ బీ ఈ ట్వీట్ చేసిన‌ట్టు అర్ద‌మ‌వుతుంది. త‌మ ప్రాణాల‌ని  ప‌ణంగా పెట్టి, కుటుంబ స‌భ్యుల‌కి దూరంగా ఉంటూ 24 గంట‌లు ప్ర‌జా సేవ కోసం ప‌ని చేస్తున్న వైద్యుల‌ని దేవుడిలా చూడాలే త‌ప్ప వారిపై దాడులు చేయోద్ద‌న్న విష‌యాన్ని నెటిజ‌న్స్ కూడా గుర్తు చేస్తున్నారు. హైద‌రాబాద్ గాంధీ ఆసుప‌త్రిలో, ఇండోర్‌లో వైద్యుల‌పై దాడులు జ‌రిగిన విష‌యం తెలిసిందే. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు, క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo