బుధవారం 03 జూన్ 2020
Cinema - May 03, 2020 , 10:17:58

కేబీసీ 12పై అమితాబ్ అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న‌

కేబీసీ 12పై అమితాబ్ అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న‌

బుల్లితెర‌పై సంచ‌ల‌నం క్రియేట్ చేసిన క్విజ్ షో కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి. అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా రూపొందిన ఈ కార్య‌క్ర‌మం ఇప్ప‌టికే 11 సీజ‌న్స్ పూర్తి చేసుకొని 12వ సీజ‌న్ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధ‌మైంది. తాజాగా కేబీస్ 12కి సంబంధించి అమితాబ్ బ‌చ్చ‌న్ అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేశారు.

మ‌న జీవితంలో ప్ర‌తి దానికి ఒక బ్రేక్ ఉంటుంది. కాని క‌ల‌ల‌కి కాదు. మీ క‌ల‌ల‌కి రెక్క‌లు అందించేందుకు అమితాబ్ బ‌చ్చ‌న్ కేబీసీ  12తో బుల్లితెర‌పై రాబోతున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం మే 9 న రాత్రి 9గం.ల నుండి ప్రారంభం కానున్న రిజిస్ట్రేష‌న్‌లో మీ పేరు రిజిస్ట్రేష‌న్ చేసుకోండి అని అమితాబ్ వీడియో ద్వారా తెలిపారు. అతి త్వ‌ర‌లోనే ఈ షో సోనీ టీవీలో ప్ర‌సారం కానుంది.


logo