e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home సినిమా వైవాహిక బంధానికి ఆమిర్‌ స్వస్తి

వైవాహిక బంధానికి ఆమిర్‌ స్వస్తి

కిరణ్‌రావ్‌ నుంచి విడిపోతున్నట్లు ప్రకటన
బాలీవుడ్‌ అగ్ర నటుడు ఆమిర్‌ఖాన్‌ తన భార్య కిరణ్‌రావ్‌ నుంచి విడిపోతున్నట్లుగా ప్రకటించారు. పదిహేనేళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లుగా శనివారం ఆమిర్‌ఖాన్‌, కిరణ్‌రావ్‌ సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదలచేశారు. ఈ విడాకులను ముగింపులా కాకుండా కొత్త బంధానికి నాందిగా భావించాలని తెలిపారు. ఇకపై వేర్వేరుగానే ఉంటూ తమ జీవితాలను, కుటుంబాలను విస్తరించుకోవడానికి ముందుకు సాగుతామని చెప్పారు. ‘పదిహేనేళ్ల ప్రయాణం జీవితకాలానికి సరిపోయే ఎన్నో మధురస్మృతులను మాకు మిగిల్చింది. చాలా ఆనందాల్ని, నవ్వుల్ని కలిసి పంచుకున్నాం. నమ్మకం, ప్రేమ, గౌరవం అనే పునాదులపై మా బంధం బలపడింది. మా జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టే సమయం ఆసన్నమైంది. ఇకపై మేము భార్యాభర్తలుగా కొనసాగబోం. చాలా కాలం నుంచి మేము విడిపోవాలని అనుకుంటున్నాం. అందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నాం. కుటుంబం కోసం సహ తల్లిదండ్రులుగా బాధ్యతల నిర్వహణలో ఒకరికొకరం అండగా ఉంటాం. కుమారుడు ఆజాద్‌కు తల్లిదండ్రులుగా ఉంటూ అతడి బరువుబాధ్యతల్ని సమంగా స్వీకరిస్తాం. అలాగే సినిమాలు, పానీ ఫౌండేషన్‌తో పాటు ఇతర వృత్తిపరమైన విషయాల్లో కలిసే పనిచేస్తాం. మా జీవితంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలను అర్థంచేసుకుంటూ నిరంతరం మాకు మద్దతును తెలియజేస్తున్న కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీ సహాయసహకారాలను ఇలాగే అందిస్తారని భావిస్తున్నాం’ అని తెలిపారు. ‘లగాన్‌’ చిత్రీకరణ సమయంలో ఆమిర్‌ఖాన్‌, కిరణ్‌రావుల మధ్య పరిచయం ఏర్పడింది. 2005 డిసెంబర్‌లో వీరు వివాహం చేసుకున్నారు. 2011లో సరోగసీ ద్వారా వీరికి కొడుకు జన్మించాడు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana