శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Cinema - Aug 05, 2020 , 15:31:27

సుశాంత్ మృతి: అంబులెన్స్ డ్రైవ‌ర్ల‌కి బెదిరింపులు

సుశాంత్ మృతి: అంబులెన్స్ డ్రైవ‌ర్ల‌కి బెదిరింపులు

సుశాంత్ మృతి విష‌యంలో అంబులెన్స్ డ్రైవ‌ర్ల‌కి బెదిరింపులు రావ‌డం క‌ల‌క‌లం రేపుతుంది. సుశాంత్ బాడీని ముంబై రెసిడెన్స్ నుండి ఆసుప‌త్రికి తీసుకెళ్లిన అంబులైన్స్ డ్రైవ‌ర్లకి గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్స్ చేసి బెదిరింపుల‌కి దిగార‌ట‌. ఆసుప‌త్రికి తీసుకెళ్ళే స‌మ‌యంలో సుశాంత్ బ్ర‌తికే ఉన్నాడు, త‌ర్వాత గొంతు నులిమి చంపేశారు. దేవుడు మిమ్మ‌ల్ని తప్ప‌క శిక్షిస్తాడు అని కాల‌ర్స్ మాట్లాడుతున్నార‌ని అంబులెన్స్ డ్రైవ‌ర్స్ చెబుతున్నారు. 

సుశాంత్‌ని ఆసుపత్రికి తీసుకెళ్ళే స‌మ‌యంలో ఫోటోగ్రాఫ‌ర్స్ అంబులెన్స్ ఫోటోలు తీయ‌గా, అవి సోష‌ల్ మీడియాలో విస్తృతంగా వైర‌ల్ అయ్యాయి. ఈ క్ర‌మంలో కొంద‌రు అజ్ఞాత వ్య‌క్తులు మాకు కాల్ చేసి దుర్బాష‌లాడారు. కొన్ని ఇంట‌ర్నేష‌న‌ల్ కాల్స్ కూడా మాకు వ‌చ్చాయ‌ని అంబులెన్స్ డ్రైవ‌ర్స్ చెబుతున్నారు. కాగా, సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ బిహార్ ప్రభుత్వం  చేసిన సిఫారసును కేంద్రం అంగీకరించిన విష‌యం తెలిసిందే. 

  


logo