By Maduri Mattaiah
కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో నిర్మాతలంతా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో తమ సినిమాలు విడుదల చేస్తూ వచ్చారు. థియేటర్లు పున:ప్రారంభమైన థియేటర్స్‌కు ప్రేక్షకులు రాకపోవడంతో కొన్ని సినిమాలు ఓటీటీ వైపుకే మొగ్గుచూపాయి. ఆ కోవలోనే నాని (Nani)నటించిన టక్ జగదీష్ (Tuck Jagadish) అమెజాన్ (Amazon Prime Video)లో విడుదలైంది. టక్ జగదీష్ పూర్తి ఫ్యామిలీ సినిమా కావడంతో, కరోనా ప్రభావం పూర్తిగా తగ్గకపోవడంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం కష్టమని భావించిన నిర్మాతలు టక్ జగదీష్‌ను ఓటీటీలో విడుదల చేశారు.
అయితే అమెజాన్ సంస్థ టక్ జగదీష్‌ను 37 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అంతేకాదు ఈ సినిమా విషయంలో ఇతర శాటిలైట్ హక్కులు అన్ని కలుపుకుని నిర్మాతకు 6 కోట్లకు పైగానే లాభం వచ్చిందట. నిన్ను కోరి సినిమా తర్వాత శివనిర్వాణ, నాని కాంబినేషన్ లో వచ్చిన చిత్రం టక్ జగదీష్. రీతూవర్మ హీరోయిన్ గా నటించగా..ఐశ్వర్యారాజేశ్ కీలకపాత్రలో నటించింది. జగపతిబాబు, రావు రమేశ్ ఇతక కీ రోల్స్ లో నటించారు.
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Shalini Pandey | అనుకోకుండా బాలీవుడ్ అవకాశం : షాలినీ పాండే
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!