మంగళవారం 20 అక్టోబర్ 2020
Cinema - Oct 09, 2020 , 13:21:42

నెవ‌ర్ బిఫోర్ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్..అమెజాన్‌ ప్రైమ్‌లో 9 సినిమాలు

నెవ‌ర్ బిఫోర్ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్..అమెజాన్‌ ప్రైమ్‌లో 9 సినిమాలు

క‌రోనా లాక్‌డౌన్‌తో థియేట‌ర్స్ అన్నీ గ‌త ఏడు నెల‌లుగా మూత‌బ‌డే ఉన్నాయి. దీంతో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంల‌కి విప‌రీత‌మైన ఆద‌ర‌ణ పెరిగింది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్‌, నెట్ ఫ్లిక్స్ వంటి దిగ్గ‌జ స్ట్రీమింగ్ సంస్థ‌లు బ‌డా హీరోల చిత్రాల‌ను కూడా విడుద‌ల చేస్తూ ప్రేక్ష‌కుల దృష్టిని త‌మ వైపుకు తిప్పుకుంటున్నారు. అమెజాన్ ప్రైమ్ సంస్థ ఆ మ‌ధ్య ఏకంగా 7 బాలీవుడ్ సినిమాలను విడుద‌ల చేయ‌గా, తాజాగా 9 సినిమాల‌ను 5 భాష‌ల‌లో విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మయ్యారు. ఇలాంటిది గ‌తంలో ఎప్పుడు జ‌ర‌గ‌క‌పోవ‌డంతో నెవ‌ర్ బిఫోర్ ఎవ‌ర్ ఆఫ్ట‌ర్ అంటున్నారు నెటిజ‌న్స్.

క‌రోనా టైంలో విడుద‌ల చేసిన గ్లోబ‌ల్ ప్రీమియ‌ర్స్‌కు మంచి ఆద‌ర‌ణ ద‌క్క‌డంతో ఇప్పుడు 9 సినిమాల‌ను విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ తొమ్మ‌ది చిత్రాల‌లో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళంతో సహా 5 భారతీయ భాషలకు సంబంధించిన మూవీస్ ఉన్నాయి. 

సూర్య న‌టించిన సూరరై పొట్రు, వరుణ్ ధావన్, సారా అలీ ఖాన్ నటించిన కూలీ నంబర్ 1, రాజ్‌కుమార్ రావు నటించిన చలాంగ్, భూమి పెడ్నేకర్ దుర్గావతి, ఆనంద్ దేవరకొండ నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ (తెలుగు), మాధవన్ నటించిన మారా (తమిళం), అరవింద్ అయ్యర్ నటించిన భీమ సేన నల మహారాజా మరియు హలాల్ లవ్ స్టోరీ (మలయాళం), మన్నే నెంబర్ 13 (కన్నడ) చిత్రాలు 2020 అక్టోబర్ 15 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 200 కి పైగా దేశాలు మరియు టెర్రిటోరియస్ లలో ప్రదర్శించబడనున్నాయి. 


logo