శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 14, 2020 , 16:35:10

'అమితాబ్ కు హ‌లో చెప్పండి' అంటున్న అలెక్సా

'అమితాబ్ కు హ‌లో చెప్పండి' అంటున్న అలెక్సా

అమెజాన్ అలెక్సా యూజ‌ర్ల‌కు బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ బచ్చ‌న్ తో మాట్లాడే అరుదైన అవ‌కాశం ల‌భించ‌నుంది. ఈ మేర‌కు అమితాబ్ ను వ‌ర్చువ‌ల్ అసిస్టెంట్ గా నియ‌మించుకున్న‌ట్టు అమెజాన్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఎఖో డివైస్ లో యూజ‌ర్లు అమితాబ్ బ‌చ్చ‌న్ కు హ‌లో చెప్పొచ్చు. ఫైర్ టీవీ, అలెక్సా యాప్, అమెజాన్ షాపింగ్ (ఆండ్రాయిడ్‌), అలెక్సా ఉన్న డివైస్ ల‌లో అమితాబ్ బ‌చ్చ‌న్ తో మాట్లాడొచ్చు. కొత్త త‌ర‌హా ఆలోచ‌న‌ల‌ను తీసుకునేందుకు టెక్నాల‌జీ ఎప్పుడూ నాకు అవ‌కాశం ఇచ్చింది. సినిమాలు, టీవీ షోలు, ఇత‌ర కార్య‌క్ర‌మాలు. అమెజాన్‌, అలెక్సాతో భాగ‌స్వామ్యం అయి నా గొంతు అందించ‌డం చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. వాయిస్ టెక్నాల‌జీతో నా అభిమానులు, శ్రేయోభిలాషులతో మ‌రింత బాగా క‌నెక్ట్ అయ్యే అవ‌కాశ‌ముంటుంద‌ని అమితాబ్ బ‌చ్చ‌న్ చెప్పారు. 

అమితాబ్ వాయిస్ కోసం అలెక్సా టీం ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేసింది. క‌స్ట‌మ‌ర్ల‌కు అద్బుత‌మైన వాయిస్ ఎక్స్‌పీరియ‌న్స్ ను ఇస్తాం. యూజ‌ర్లు అలెక్సా బ‌చ్చ‌న్ తో క‌నెక్ట్ అయి జోక్స్ చెప్పొచ్చు. వాతావ‌ర‌ణ సూచ‌న‌లు ఇవ్వొ్చ్చు. ప్రేరణ క‌లిగించే సూక్తులు చెప్ప‌డం, స‌ల‌హాలు కూడా ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని అమెజాన్ తెలిపింది. అలెక్సా కోసం వాయిస్ ఇస్తున్న తొలి సెల‌బ్రిటీగా అమితాబ్ బచ్చ‌న్ నిలిచారు. అమితాబ్ తో మాట్లాడే అవ‌కాశం వ‌చ్చే ఏడాది అందుబాటులోకి రానుంది. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.