శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 28, 2020 , 00:48:19

మూగ యువతిగా...

మూగ యువతిగా...

సవాళ్లకు సై అంటున్నారు సీనియర్‌ కథానాయికలు. కథ, పాత్రల పరంగా  కొత్తదనం ఉంటేనే సినిమాల్ని  అంగీకరిస్తున్నారు. ప్రయోగాత్మక ఇతివృత్తాలకు పెద్దపీట వేయడంలో తెలుగు చిత్రసీమలో సమంత ముందువరుసలో ఉంటుంది. పెళ్లి తర్వాత విభిన్నమైన కథాంశాల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తోన్న ఆమె తదుపరి సినిమాలో ఇంద్రియవైకల్యమున్న యువతిగా చాలెంజింగ్‌ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.  సమంత కథానాయికగా ‘మయూరి’ ఫేమ్‌ అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం రూపుదిద్దుకోనున్నది. హారర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత మూగ యువతిగా కనిపించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.  ఈ పాత్ర కోసం ఆన్‌లైన్‌ వర్క్‌షాప్‌లకు సమంత హాజరైనట్లు తెలిసింది. సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకున్నట్లు చెబుతున్నారు. నటిగా సమంతను సరికొత్తగా ఆవిష్కరించే చిత్రమవుతుందని అంటున్నారు. నవంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభంకానున్నట్లు సమాచారం.  తమిళ    నటుడు ప్రసన్న ఈ సినిమాలో కీలక పాత్రను పోషించనున్నారు.