గ్లామర్ బ్యూటీ అమలాపాల్ తెలుగు, తమిళం,మలయాళ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ ఉంటుంది. అమలాపాల్ తెలుగులో నాయక్, ఇద్దరమ్మాయిలతో, జెండా పై కపిరాజు లాంటి చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ఇతర భాషల చిత్రాలలో బిజీ అయింది. నటనతోనే కాకుండా గ్లామర్ షోతోను ప్రేక్షకుల మనసులు దోచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
లవ్ ఫెల్యూర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది అందాల భామ అమలాపాల్. కమర్షియల్ సినిమాలతోపాటు లేడీఓరియేంటేడ్ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంటుంది అమల. అమలాపాల్ తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే ఎంతటి బోల్డ్ రోల్ అయినా ఓకే చెప్పేస్తోంది. ఆమె అనే సినిమాలో అమలా ఎంత బోల్డ్‌గా నటించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయింది. అప్పుడప్పుడు బోల్డ్ ఫొటో షూట్స్‌తో అందరి దృష్టి తనపై పడేలా చేస్తుంటుంది అమలాపాల్. తాజాగా ఈ ముద్దుగమ్మ బీచ్ దగ్గర హోయలు పోతూ స్టిల్స్ ఇచ్చింది. ఇవి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.