శుక్రవారం 05 జూన్ 2020
Cinema - May 06, 2020 , 23:17:35

అమలాపాల్‌ క్వారంఫైన్‌ పార్టీ

అమలాపాల్‌ క్వారంఫైన్‌ పార్టీ

లాక్‌డౌన్‌ వేళ పార్టీకి హాజరైంది అమలాపాల్‌.  ఈ వేడుకలో  సంగీతాన్ని ఆస్వాదిస్తూ డ్యాన్స్‌ చేస్తూ ఉత్సాహంగా కనిపించింది.  ఈ పార్టీకి వేదిక పబ్‌, హోటల్‌ కాదు తన  ఇళ్లేనని  చెబుతోందామె.  సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వైవిధ్యమైన కథాంశాల్ని ఎంచుకుంటూ సినిమాలు చేస్తోంది అమలాపాల్‌. ప్రస్తుతం కరోనా ప్రభావం కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో విరామసమయాన్ని కుటుంబంతో గడపడానికి కేటాయిస్తోంది. అమలాపాల్‌ సోదరుడు అభిజిత్‌పాల్‌ పుట్టినరోజు వేడుకలు మంగళవారం జరిగాయి. ఈ పార్టీలో  ముఖానికి మాస్క్‌ ధరించి పాప్‌ సాంగ్స్‌కు డ్యాన్స్‌ చేస్తోన్న తన వీడియోను అభిమానులతో పంచుకుంది అమలాపాల్‌.   అందరం కలిసి ఉండకుండా భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌ ధరించి ఈ పార్టీని చేసుకున్నామని చెప్పింది. క్వారంటైన్‌ కాదు క్వారంఫైన్‌ పార్టీ ఇదంటూ చమత్కరించింది అమలాపాల్‌. ప్రస్తుతం తెలుగులో ‘లస్ట్‌స్టోరీస్‌' రీమేక్‌తో పాటు హిందీలో ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది అమలపాల్‌. తమిళంలో ఆమె నటించిన ‘ అదో అంద పరవై పోలా’తో పాటు మరో సినిమా విడుదలకు సిద్ధంగా  ఉంది.logo