గురువారం 22 అక్టోబర్ 2020
Cinema - Sep 21, 2020 , 13:29:55

‘అల్లుడు అదుర్స్‌’ షూటింగ్‌ షురూ..

‘అల్లుడు అదుర్స్‌’ షూటింగ్‌ షురూ..

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రం షూటింగ్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. బెల్లకొండ, ప్రకాశ్‌రాజ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్‌. హీరోయిన్లు నభా నటేశ్, అను ఇమ్మాన్యుయేట్‌ కూడా త్వరలో షూటింగ్‌లో జాయిన్‌ కానున్నారు. బెల్లంకొండ ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ అబ్స్‌తో కనిపించనున్నాడు. కరోనా లాక్‌డౌన్‌ టైంలో కూడా రెగ్యులర్‌గా జిమ్‌లో చాలా కేర్‌ తీసుకోగా.. కొత్త లుక్‌లో కనిపించనున్నాడట. యాక్షన్‌తో పాటు అదే స్థాయిలో పూర్తి వినోదాత్మక పాత్రలో శ్రీనివాస్‌ కనిపించనున్నారు. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాకు పాజిటివ్ వైబ్స్‌ తెచ్చిపెడుతుంది. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ సమర్పణలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చిత్రం తెరకెక్కుతోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి బాణీలు అందిస్తున్నాడు. ‘అల్లుడు అదుర్స్‌’కు సంబంధించి టీజర్‌ను త్వరలో విడుదల చేయనున్నఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


logo