శుక్రవారం 22 జనవరి 2021
Cinema - Jan 14, 2021 , 00:12:41

ఆ ఫీలింగ్‌ దూరం చేసింది..

ఆ ఫీలింగ్‌ దూరం చేసింది..

‘కమర్షియల్‌ సినిమాలు చేసినా అందులో కొత్తదనం ఉండాలి. నటనలో వైవిధ్యతను ప్రదర్శించేందుకు ఆస్కారముంటూ పాత్రలు చాలెంజింగ్‌గా సాగాలి.  అలాంటి సినిమాలే చేస్తా’ అని అన్నారు బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌. ఆయన హీరోగా నటించిన  చిత్రం ‘అల్లుడు అదుర్స్‌'. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకుడు. నేడు ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా సాయి శ్రీనివాస్‌ మాట్లాడుతూ “రాక్షసుడు’ విజయం తర్వాత కొత్త జోనర్‌లో సినిమా చేయాలనే ఆలోచనతో చాలా కథలు విన్నా. ఈ క్రమంలో సంతోష్‌ శ్రీనివాస్‌ చెప్పిన ‘అల్లుడు అదుర్స్‌' పాయింట్‌ నచ్చింది. కుటుంబ విలువలతో తెరకెక్కిన పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. రొటీన్‌ ఫ్యామిలీ డ్రామాలకు భిన్నంగా హారర్‌ ఎలిమెంట్స్‌తో నవ్యరీతిలో సాగుతుంది. తొలిసారి హారర్‌ సినిమాలో నటిస్తుండటంతో పాత్రలో పర్‌ఫెక్షన్‌ కోసం చాలా జాగ్రత్తలు తీసుకున్నా. నేను పూర్తిస్థాయి కమర్షియల్‌ సినిమా చేసి రెండేళ్లయింది. ఆ సినిమాల్ని మిస్సవుతున్న ఫీలింగ్‌ దూరం చేసిన చిత్రమిది.   ఈ సినిమాలో రిహార్సల్‌ లేకుండానే పాటల్లో డ్యాన్సులు చేశా. పంపిణీదారులు, ఎగ్జిబిటర్ల ఒత్తిడితోనే ప్రకటించిన తేదీకంటే ఒక రోజు ముందుగా ప్రేక్షకుల ముందుకువస్తున్నాం. ఈ సంక్రాంతి మా సినిమా విందుభోజనంగా ఉంటుంది.  ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నా. మార్చిలో ఈసినిమా ప్రారంభంకానుంది’ అని తెలిపారు.  logo