ప్రేయసిని ఇంప్రెస్ చేసేందుకు ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో ప్రయత్నిస్తుంటారు. ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ కు మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేస్తూ పానీపూరిలో రింగ్ ను ఉంచి ప్రేయసిని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. సహజంగా ఎవరైనా వైన్ గ్లాస్, కేక్ పై రింగ్ ను ఉంచి స్పెషల్ డేను ప్లాన్ చేసుకుంటారు.
అయితే ఇతగాడు పానీపూరిలో రింగ్ ను దాచి గర్ల్ ఫ్రెండ్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు. మంత్లీ అందాజ్ ఈ జహన్ అనే పేజ్ వీరి వెడ్డింగ్ ప్రపోజల్ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు తలో రకంగా కామెంట్ చేశారు. రబ్నే బనాది జోడి అని ఓ యూజర్ రియాక్టవగా, ఇలా ప్రపోజ్ చేయడం మంచి ఆలోచన కాదని, కొందరు అమ్మాయిలు పానీపూరీలను నమిలేస్తుంటారు జాగ్రత్త అంటూ మరో యూజర్ కామెంట్ చేశాడు.